‘మ‌జిలీ’ రీమేక్ లో ధ‌నుష్‌..??

గ‌త‌వారం విడుద‌లైన ‘మ‌జిలీ’ ఫీల్ గుడ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా పేరు తెచ్చుకుంది. అటు పాజిటీవ్‌రివ్యూలు, ఇటు క‌ల‌క్ష‌న్లూ ద‌క్కాయి. నాగ‌చైత‌న్య కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా మ‌జిలీ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ క‌థకు గిరాకీ మ‌రింత పెరిగింది. త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల నుంచి రీమేక్ రైట్స్ కోసం ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. క‌న్న‌డ రీమేక్ దాదాపు క‌న్‌ఫామ్ అయిపోయిన‌ట్టే. త‌మిళంలో ఈ సినిమాని ధ‌నుష్ తో చేస్తే బాగుంటుంద‌ని అక్క‌డి నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈసినిమాని ధ‌నుష్‌కి చూపించి, త‌న‌కు న‌చ్చితే, వెంట‌నే రీమేక్‌కి రంగం సిద్దం చేసుకోవాల‌ని అనుకుంటున్నారు. మ‌జిలీని త‌మిళంలో విడుద‌ల చేశారు. కాక‌పోతే తెలుగు వెర్ష‌న్ వెళ్లింది. దానికి మంచి వ‌సూళ్లే ద‌క్కాయి. త‌మిళంలో డ‌బ్ చేసి విడుద‌ల చేద్దామ‌ని నిర్మాత‌లు భావిస్తున్న త‌రుణంలో రీమేక్ ఛాన్స్ వ‌చ్చింది. ఆ రూపంలోనూ నిర్మాత‌ల‌కు మంచి రేటే గిట్టుబాటు అయ్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త‌మిళంలో ఈ సినిమా చేస్తే… గీస్తే ధ‌నుష్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌డు. ధ‌నుష్ బాడీ లాంగ్వేజ్‌కి ఇలాంటి పాత్ర‌లు బాగా సూట‌వుతాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close