అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో అనుసరిస్తున్న తాజా వ్యూహం ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేస్తోంది. యుద్ధం ముగియడానికి ఇరాన్ తనతో ఎటువంటి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం రెండు మూడు వారాల్లోనే తాము అక్కడి నుంచి వెనుదిరుగుతామని ఆయన తాజాగా ప్రకటించారు.
ఎంత విధ్వంసం చేసినా లొంగని ఇరాన్
ఇరాన్ అణు సామర్థ్యాన్ని , సైనిక వ్యవస్థను కోలుకోలేనంతగా దెబ్బతీసి విజేతగా ప్రకటించుకోవాలని ట్రంప్ అనుకుంటున్నారు. ఇరాన్ను రాతియుగం నాటి స్థితికి పంపించాం, ఇక వారు రాబోయే 15-20 ఏళ్ల వరకు అణుబాంబు గురించి ఆలోచించలేరు అని ట్రంప్ చెబుతున్నారు. ఒప్పందాలు చేసుకోవడం కంటే, వారి శక్తిని పూర్తిగా నిర్వీర్యం చేసి మిషన్ కంప్లీట్ అని ప్రకటించి వెనక్కి రావడమే ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఇరాన్ ఒప్పందానికి ముందుకు రాకపోవడమే. అసాధ్యమైన ప్రతిపాదనలు రెండు దేశాలు చేస్తున్నాయి.
యుద్ధం ఆగగానే చమురుధరలు తగ్గిపోతాయట!
యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్లు దాటడం అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారాన్ని పెంచింది. మేము ఇరాన్ నుంచి బయటకు రాగానే చమురు ధరలు కుప్పకూలుతాయి అని అని ట్రంప్ చెబుతున్నారు లకానీ.. హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణాను పునరుద్ధరించడం కంటే, యుద్ధం ముగించి మార్కెట్లో అనిశ్చితిని తొలగించడం ద్వారా ధరలను తగ్గించవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు.
ట్రంప్ ఒంటరి – ఫ్రెండ్స్ కూడా దూరమే
సాధారణంగా యుద్ధం ముగిసేటప్పుడు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరుగుతుంది. కానీ ట్రంప్ ఒప్పందం ఇక్కడ అప్రస్తుతం అని అనడం ద్వారా ఇరాన్ నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని సంకేతాలిచ్చారు. ఇజ్రాయెల్ వంటి మిత్రదేశాలు ఇంకా యుద్ధ లక్ష్యాలు పూర్తి కాలేదని అంటున్నా, ట్రంప్ మాత్రం ఏకపక్షంగా గడువు విధించుకోవడం చర్చనీయాంశమైంది. ట్రంప్ చెబుతున్నట్లుగా కేవలం 2-3 వారాల్లోనే ఈ సంక్లిష్టమైన యుద్ధం ముగుస్తుందా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒకవైపు వేలాది మంది సైనికులను మోహరిస్తూనే, మరోవైపు వెళ్ళిపోతాం అని చెప్పడం ప్రత్యర్థిని గందరగోళానికి గురిచేసే మైండ్ గేమ్ కావచ్చని భావిస్తున్నారు. అయితే ట్రంప్ నిర్ణయాలను పరిశీలిస్తున్న వారు .. మాత్రం తలబాదుకుంటున్నారు.
