నాలుగు రాష్ట్రాల కంటే ముందే తెలంగాణ ఎన్నికలా..? మాస్టర్ ప్లాన్ ఉందా..?

తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నాలుగు రాష్ట్రాలతో పాటు నిర్వహించేలా.. కేసీఆర్.. అఘమేఘాల మీద అసెంబ్లీని రద్దు చేశారన్న ప్రచారం జరిగింది. ఆయన కూడా..ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే ఎన్నికలు వస్తాయని.. షెడ్యూల్ చెప్పుకొచ్చారు. వాటిని ఈసీ ఖండించింది. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించాలన్నదానిపై కసరత్తు చేస్తున్నామని చెప్పుకొచ్చింది. నిజానికి ఇప్పుడు.. ఎన్నికల సంఘానికి… ఆ నాలుగు రాష్ట్రాలు ప్రయారిటీ కాదు. ఇప్పటికిప్పుడు కుదిరితే రేపే తెలంగాణ ఎన్నికలు పెట్టాలన్నంత ఉత్సాహం చూపిస్తోంది. ఇలా అసెంబ్లీ రద్దు గెజిట్ రాగానే.. అలా ఈసీ తెలంగాణ అధికారులతో చర్చలు జరిపింది. ఆ తర్వాత నుంచి రోజు రోజుకు శరవేగంగా ఏర్పాట్లు సాగిపోతున్నాయి.

తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి.. రజత్ కుమార్ ఈ విషయంలో మరింత ఉత్సాహంగా ఉన్నారు. అయిన అసెంబ్లీ రద్దు అయిన రోజే .. తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామనే నోట్‌ను పంపించారు. అప్పుడే.. ఢిల్లీ ఈసీ కూడా.. ప్రత్యక్ష పరిశీలన కోసం.. ఓ టీమ్‌ను పంపాలని డిసైడయింది. పదకొండో తేదీన వారు వస్తారు. మొత్తం చూస్తారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించవచ్చని… డిక్లేర్ చేస్తారు. అది కామన్. మరి ఓటర్ల లిస్టులు…? అవి కూడా..ముందస్తుగానే ప్రిపేర్ చేయాడనికి ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. దానికి వచ్చే నెల మొదటి వారం వరకు గడువు ఇచ్చి. ఈసీ వేగం చూస్తూంటే.. గతంలో.. కేసీఆర్ మున్సిపల్ ఎలక్షన్స్ పెట్టిన వ్యవహారం గుర్తుకు వచ్చేలా ఉంది. నోటిఫికేషన్లు, నామినేషన్లు, ప్రచారం, ఓటింగ్, రిజల్ట్ మొత్తం పది రోజుల్లో వచ్చేలా చేసి.. ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పారు కేసీఆర్. ఇప్పుడు అదే మోడల్ ఈసీ అడాప్ట్ చేసుకునే ఉందనే సైటెర్లు వినిపిస్తున్నాయి.

అసలు ఈసీ ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల విషయంలో లేనంత తొందర… కావాలని అసెంబ్లీని రద్దు చేసుకున్న తెలంగాణ విషయంలో ఎందుకు..? కేంద్రం నుంచి స్పష్టమైన సూచనలు రావడమే కారణమని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నికల కంటే ముందే నిర్వహించి.. ఫలితాలు వచ్చేలా చూడాలన్నది ఈసీకి అందిన సూచనట. ఎందుకంటే..ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోతే.. ఆ తర్వాత పోలింగ్ జరిగే నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ సెంటిమెంట్ దెబ్బతింటందనేది వారి ఆలోచన అట. వారే తమకు పోస్టులు కట్టబెట్టారు కాబట్టి.. ఈసీ అధికారులకు రాజ్యాంగం కన్నా.. కేంద్రం పెద్దలు చెప్పేదే వేదం. అందుకే వారు ఉరుకులు పరుగులు పెడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close