మేం కలిసి పోయాం అంటున్న రూప, శ్రీను వైట్ల..!

కొద్దిరోజులుగా శ్రీనువైట్ల టైం ఏం బాలేదన్న విషయం తెలిసిందే. ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కించిన బ్రూస్ లీ యావరేజ్ గా నిలవడం.. కోనా వెంకట్ తో మళ్లీ గొడవలు స్టార్ట్ అవడం.. ఇవన్నీ చాలవన్నట్టు తన భార్య రూప శ్రీను వైట్లపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అది కాస్త కోర్ట్ దాకా వెళ్లదం ఇదంతా జరిగిపోయింది. ఈ టైంలో శ్రీనువైట్లని చూసి పాపం అని అనుకున్నారు అంతా.. అయితే దీపావళి మిగతా వారిని ఎన్నో సంతోషాలను తెచ్చిపెట్టిందో తెలియదు కాని శ్రీనువైట్ల ఇంట్లో మాత్రం సుఖ సంతోషాలని తెచ్చింది.

దీపావళి సందర్భంగా శ్రీనువైట్ల తన ఫ్యామిలీతో చైనా ట్రిప్ వెళ్లి రావడం.. రూప శ్రీనువైట్ల మధ్య గొడవలన్ని సర్ధుమనగడం జరిగాయట. ఆ విషయాన్నే ఎనౌన్స్ చేస్తూ రూప వైట్ల శ్రీనువైట్లతో దిగిన సెల్ఫీని ట్విట్టర్లో పోస్ట్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. సాధారణంగా ఫ్యామిలీలో గొడవలు రావడం సహజం అయితే సెలబ్రిటీస్ అయ్యేసరికి అదేదో సెన్షేషన్ అన్నట్టు చేసి చూపించి ఆరోజు టి.ఆర్.పి రేటింగ్ ని పెచుకోవడం కోసం చానెల్స్ వారు రకరకాలుగా ప్రచారం చేస్తారు.

ఇప్పుడు ఇద్దరు అన్యోన్యంగా ఇలా సెల్ఫీలు దిగుతూ కనపడి మీడియా వారికి షాక్ ఇచ్చారు శ్రీను వైట్ల, రూపలు. అందుకే ఈ దీపావళి శ్రీనువైట్ల జీవితంలో చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. చూస్తూనే ఉండండి ఈ జోష్ లోనే శ్రీనువైట్ల ఇవాళ రేపో ఏదో ఒక కొత్త సినిమా న్యూస్ తో మనముందుకు వస్తాడు.. అది కాస్త హిట్ అయితే పోయిన క్రేజ్ అంతా తిరిగి వచ్చేసినట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close