ఎర్రబెల్లిపై ఎప్పుడూ డౌటే!

Telakapalli-Raviఎర్రబెల్లి దయాకరరావు తెలుగుదేశం అధినేతకు సన్నిహితుడుగా వుంటూనే తెలంగాణ సమీకరణాల్లో విచిత్రమైన పాత్ర పోషిస్తూ వచ్చారు. ఆయన చాలా కాలంగా టిఆర్‌ఎస్‌లో చేరడానికి ప్రయత్నిస్తూనే వున్నట్టు చెప్పడానికి రకరకాల కథనాలున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా తను వెళ్లబోతున్నట్టు వార్తలు రావడం తర్వాత సర్దుకోవడం పరిపాటిగా వుండేది. ఆ రోజుల్లో చాలాసార్లు సన్నిహితంగా మాట్లాడేవాణ్ని. మిగిలిన వారు ఉద్రేకపడినప్పుడు కాస్త సర్దిచెప్పే పాత్ర పోషించారు. ఎర్రబెల్లిని అట్టిపెట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు తీసుకున్న చర్యలపైనా చాలా కథలున్నాయి. శాసనమండలి సభ్యులొకరు చెప్పిన కథ వాటిలో ఆసక్తికరమైంది. తను టిఆర్‌ఎస్‌లో చేరేందుకు సహకరించవలసిందిగా ఎర్రబెల్లి కెసిఆర్‌కు సన్నిహితంగా వుండే ఒక అగ్రశ్రేణి వాణిజ్యవేత్తను కోరారట. ఆ విషయం చంద్రబాబుకు తెలిసి ఆ వాణిజ్యవేత్తపై నిప్పులు కక్కారట. ఆ పైన సదరు వాణిజ్యవేత్త ఎర్రబెల్లిని బాగా దూరం పెట్టారట. కాగా మరో కథ కడియం శ్రీహరికి సంబంధించింది. వరంగల్‌లో వారిద్దరూ ఉప్పు నిప్పులా వుంటారు. ఆయన టిఆర్‌ఎస్‌లో చేరి మంత్రి కాకుండా తను అడ్డుపడ్డానని ఎర్రబెల్లి పొరబడుతున్నారని ఆయనే ఒక సారి చెప్పినట్టు సమాచారం. కాగా ఒకసారి ఎర్రబెల్లి స్వయంగా సిఎం కెసిఆర్‌ను కలుసుకోవడానికి వెళితే ఆయన ప్రధాన ప్రత్యర్థి రహస్యంగా షూట్‌ చేసి ఛానళ్లకు పంపించారు. దాంతో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు వెళ్లానంటూ వివరణ ఇచ్చారు. శాసనసభలో రాజకీయంగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా రేవంత్‌ రెడ్డి ధోరణి బాగా లేదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. ఘర్షణ పడ్డారు కూడా. అధినేత ఆయన కుమారుడు లోకేష్‌లు ప్రాధాన్యతనివ్వకపోవడం వీటికి తోడైంది. బహుశా ఈ సందేహాస్పద పరిస్థితివల్లనే వారు దూరం పెట్టివుండే అవకాశం వుంది. ఎట్టకేలకు ఈ అధ్యాయం ముగించి ఇప్పుడు టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చేసుకున్నారు.తధాస్తు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close