‘ఎఫ్ 2’ ట్రైల‌ర్‌: ఈసారీ గ‌ట్టిగా న‌వ్వించేశారు

ద‌ర్శ‌కుడిగా అనిల్ రావిపూడి బ్రాండ్ ఏమిట‌న్న‌ది.. త‌న మూడు సినిమాల ద్వారా తెలిసిపోయింది. ప‌టాస్. సుప్రీమ్‌, రాజా ది గ్రేట్‌ల‌లో బాగా న‌వ్వించేశాడు. అందుకు డ‌బుల్ వినోదం ఇవ్వ‌బోతున్న‌ట్టు `ఎఫ్ 2` టైటిల్ ద్వారానే హింట్ ఇచ్చేశాడు. ఈ సినిమా నిండా న‌వ్వులే న‌వ్వుల‌న్న విష‌యం కొత్త ట్రైల‌ర్ చూసినా అర్థ‌మైపోతోంది. ఈనెల 12న `ఎఫ్ 2` విడుద‌ల అవుతోంది. వెంక‌టేష్‌, వ‌రుణ్‌తేజ్ క‌థానాయ‌కులుగా న‌టించిన చిత్ర‌మిది. ఈరోజు కొత్త ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. భార్యాబాధితులుగా వెంకీ, వ‌రుణ్ మ‌రోసారి చెల‌రేగిపోయారు. వెంకీ కామెడీ టైమింగ్‌.. ఓ రేంజులో క‌నిపించింది. నువ్వు నాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వ‌రి త‌ర‌వాత వెంకీ టైమింగ్, గెట‌ప్ అంత బాగా సూటైన సినిమా ఇదేనేమో. అన్న‌పూర్ణ ద‌గ్గ‌ర వెంక‌టేష్ చెప్పిన డైలాగ్‌.. ఈ ట్రైల‌ర్‌కే హైలెట్‌గా నిలుస్తుంది. అనిల్ రావిపూడి సినిమాల్లో క‌నిపించే విచిత్ర‌మైన మేన‌రిజాలు, క్యారెక్ట‌రైజేష‌న్లు… ఈ ట్రైల‌ర్లోనూ క‌నిపించాయి. క‌వ్వించాయి. అడుగ‌డుగునా.. న‌వ్వించాల‌న్న త‌ప‌న‌, సూప‌ర్ కాంబినేష‌న్‌, క‌ల‌ర్‌ఫుల్ విజువ‌ల్స్‌.. ఈ సినిమాని నిల‌బెట్టి తీర‌తాయ‌న్న న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తున్నాయి. ఈ సంక్రాంతికి రాబోతున్న మిగిలిన సినిమాల‌కు ఎఫ్ 2 గ‌ట్టి పోటీ ఇవ్వ‌బోతోంద‌న్న సంగ‌తి ఈ ట్రైల‌ర్ ద్వారా మ‌రోసారి చాటి చెప్పాడు దిల్‌రాజు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close