సినిమా రంగాన్ని లక్ష్యంగా చేసుకుని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై రియాక్షన్స్ ప్రారంభమయ్యాయి. చిత్ర పరిశ్రమలోని వారు ప్రతి 90 రోజులకు ఒకసారి తప్పనిసరిగా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలంటూ ఆయన చేసిన ప్రతిపాదనపై సినీ ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్నారు. పరిశ్రమలోని ప్రతి ఒక్కరినీ నేరస్తులుగా చిత్రీకరించేలా ఉన్న ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. కేవలం పబ్లిసిటీ కోసమే అనిరుధ్ రెడ్డి పదేపదే సినిమా రంగాన్ని టార్గెట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ వ్యాఖ్యలపై నటుడు రాహుల్ రామకృష్ణ తనదైన శైలిలో స్పందించారు. ముందు రాజకీయ నాయకులు తమ టెస్టులు, ఆస్తుల వివరాలను ప్రతి మూడు నెలలకోసారి బహిరంగంగా ప్రకటించాలి అంటూ ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. అందరం టెస్టులు చేయించుకుందామని.. రాజకీయ నేతలు లై డిటెక్టర్ పరీక్షలకు రావాలన్నారు. నటీనటులం డ్రగ్ టెస్టులు, రాజకీయ నాయకులు లై డిటెక్టర్ టెస్టులు… ప్రతి ఆదివారం ఈ గొప్ప కార్యక్రమం పెట్టుకుందాం. అప్పుడే మీ మాట, మా మాట నమ్మి ప్రజలు అందరూ అభివృద్ధి చెందుతారు అని రాహుల్ రామకృష్ణ పిలుపునిచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నికల్లో నామినేషన్స్ ఫైల్ చేసే ముందు నాయకులు ఎటువంటి టెస్టులు చేయించుకోవాలని ప్రశ్నించారు.
నిరంతరం టాలీవుడ్‌ను వివాదాల్లోకి లాగుతున్న అనిరుధ్ రెడ్డికి ఈసారి గట్టిగా బుద్ధి చెప్పాలని సినీ పెద్దలు భావిస్తున్నారు. పరిశ్రమలోని వివిధ సంఘాలు ఏకమై ఈ టార్గెట్ పాలిటిక్స్ కు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.అనిరుథ్ రెడ్డి ప్రతీ దానికి సినిమాలతో ముడి పెడుతున్నరాు. చివరికి తన ఇప్పసారా వాదనను సమర్థించుకోవడానికి కూడా సినిాలనే చూపిస్తున్నారు.
