ప్రస్తుత రాజకీయాల్లో విజయకేతనం ఎగురవేయాలంటే కేవలం పాత తరం ఓటర్ల సమీకరణాలు సరిపోవు. దేశ జనాభాలో సింహభాగంగా ఉన్న జెన్ జీ ఓటర్ల మనసు గెలుచుకున్న పార్టీలకే భవిష్యత్తు ఉంటుంది. అయితే, ఈ తరం ఓటర్లు కేవలం పైపైన కనిపించే సోషల్ మీడియా రీల్స్ చూసో లేదా పసలేని నినాదాలు వినో ప్రభావితం కారు. వారు కోరుకునేది ప్రాక్టికల్ అప్రోచ్ ఎమోషనల్ బాండింగ్.
డిజిటల్ కనెక్ట్ వర్సెస్ ఎమోషనల్ బాండింగ్
రాజకీయ పార్టీలు తమను కేవలం ఒక ఓటు బ్యాంకుగా చూస్తే జెన్ జీ ఓటర్లు అస్సలు సహించరు. వారికి తాము కోరుకునే నాయకుడు తమ భాషలో మాట్లాడాలి, తమ సమస్యలను అర్థం చేసుకోవాలి. కేవలం ఐటీ సెల్స్ ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తే నమ్మేంత అమాయకులుగా ఈ తరం లేదు. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పక్కాగా అర్థం చేసుకున్నారు. విపక్షంలో ఉన్న సమయంలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి, విద్యార్థులు, నిరుద్యోగులతో నేరుగా ముఖాముఖి చర్చలు జరుపుతూ వారితో ఒక ఎమోషనల్ బాండింగ్ పెంచుకున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగా పార్టీ అజెండాను మార్చడం ద్వారా లోకేష్ యువతలో తన ఇమేజ్ను గణనీయంగా పెంచుకున్నారు.
లోకేష్ అప్ డేట్ వెర్షన్
లోకేష్ తన రాజకీయ శైలిని పూర్తిగా జెన్ జీకి నచ్చేలా అప్డేట్ చేసుకున్నారు. యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై స్పష్టమైన విజన్‌తో ముందుకు వెళ్తున్నారు. దీనికి భిన్నంగా జగన్ రెడ్డి పాతకాలపు రివర్స్ పాలిటిక్స్‌పైనే ఆధారపడుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబుపై బురద చల్లితే, ప్రజలు వేరే దారి లేక తనకే ఓటు వేస్తారని జగన్ భావిస్తుంటారు. గతంలో ఒకసారి ఛాన్స్ ఇచ్చినంత మాత్రాన, అదే ఫార్ములా ప్రతిసారీ పనిచేస్తుందని అనుకోవడం ఆయన రాజకీయ అపరిపక్వతే అవుతుంది. ఈ తరం ఓటర్లు నెగెటివ్ పాలిటిక్స్ కంటే ప్రొడక్టివ్ పాలిటిక్స్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నారనే వాస్తవాన్ని జగన్ గుర్తించలేకపోతున్నారు.
అసెంబ్లీకి వెళ్లని నైజం – జెన్ జీ తిరస్కారం
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నత వేదికైన అసెంబ్లీని బహిష్కరించి ఇంట్లో పడుకోవడం వంటి చర్యలను నేటి తరం యువత బాధ్యతారాహిత్యంగా భావిస్తుంది. నాయకుడు అంటే సమస్యలపై పోరాడాలి కానీ, అధికారం లేదని పారిపోకూడదని వారు నమ్ముతారు. జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా మొండికేయడం వల్ల తన రాజకీయ సీరియస్‌నెస్‌ను కోల్పోతున్నారు. చదువుకున్న జెన్ జీ ఓటర్లు ఇలాంటి ప్రవర్తనను గమనిస్తున్నారు. ఎప్పుడూ తమకు అందుబాటులో ఉంటూ, సమస్యలపై నిరంతరం గళమెత్తే లోకేష్ వంటి నాయకుల వైపే వారు మొగ్గు చూపుతారు తప్ప, ప్యాలెస్‌లకే పరిమితమయ్యే నేతల గురించి వారు ఆలోచించే ప్రసక్తే లేదు.
వ్యూహం లేని వైసీపీ – విజన్ ఉన్న కూటమి
వైసీపీలో యువతను ఆకట్టుకునేలా ఎటువంటి లోతైన వ్యూహాలు కనిపించడం లేదు. కేవలం కొన్ని పార్టీ అనుకూల ఛానళ్లు, పేజీల ద్వారా పాత తరం విమర్శలను వాడుతూ కాలం గడిపేస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం నైపుణ్య గణన వంటి వినూత్న కార్యక్రమాలతో జెన్ జీకి భవిష్యత్తుపై భరోసా ఇస్తోంది. ఓటరు కేవలం ఒక బటన్ నొక్కితే వచ్చే లబ్ధిని మాత్రమే కాకుండా, గౌరవప్రదమైన ఉపాధిని కోరుకుంటున్నాడు. ఈ పల్స్‌ను పట్టుకోవడంలో లోకేష్ సక్సెస్ కాగా, జగన్ తన పాత వ్యూహాలకే కట్టుబడి ఉండి రాజకీయంగా వెనుకబడిపోతున్నారు.
రాజకీయాల్లో మనుగడ సాగించాలంటే కాలానుగుణంగా మారాలి. జెన్ జీ ఓటర్ల ఆలోచనా విధానం గత తరం కంటే భిన్నంగా, వేగంగా ఉంటుంది. ఎమోషనల్ బాండింగ్, క్లారిటీ ఉన్న విజన్ ఉన్న నాయకుడినే వారు ఆదరిస్తారు.
