ఫస్ట్ లుక్ తో అదరగొడుతున్న గోపీచంద్ ‘సౌఖ్యం’

టాలీవుడ్ హీరోల్లో మాన్లీగా ఉండి హీరోయిజం చూపించే వారిలో గోపీచంద్ ఒకడు. మాస్ మసాలా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ఏర్పాటుచేసుకున్న గోపీచంద్ ఈ మధ్య కొంచం రూటు మార్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాల మీద పడ్డాడు. ‘లౌఖ్యం’గా హిట్ కొట్టిన ఈ హీరో స్టైలిష్ గా తీసిన జిల్ సినిమాతో పర్వాలేదనిపించుకుని ఇప్పుడు ‘సౌఖ్యం’ సినిమాతో మనముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తనకు యజ్ఞం లాంటి మొదటి భారీ హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు ఏ.ఎస్.రవికుమార్ తో కలిసి చేస్తున్న రెండో సినిమా సౌఖ్యం కావడంతో గోపీచంద్ ఈ సినిమాపై బాగా అంచనాలు పెట్టుకోవడం విశేషం.

భవ్య క్రియేషన్స్ బ్యానర్లో భవ్య ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. గోపీచంద్ రెజినాల జంట చూడముచ్చటగా ఉంటూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టరే సినిమాకు హిట్ కళ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆడియో త్వరలో ఒంగోలులో జరుగనుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో రెజినా అందాలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచే చాన్స్ ఉంది. మరి సౌఖ్యం సినిమాతో గోపీ ఎలాంటి హిట్ కొడతాడో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close