మోడీ కేబినెట్‌లో ఉత్తరాది ప్రాబల్యం..! సమతూకం ఉందా..?

భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ రెండో సారి బాధ్యతలు చేపట్టారు. తన టీంను కూడా ఏర్పాటు చేసుకున్నారు. కానీ.. ఇందులో… సమీకరణాలు.. ప్రాంతాల వారీగా చూస్తే… సమతుల్యం మాత్రం మిస్సయినట్లుగా కనిపిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ సహా 58 మందితో మంత్రి మండలి ఏర్పాటయింది. ఇందులో దక్షిణాది నుంచి ఉన్నవారు అతి స్వల్పమయితే.. అందులోనూ సహాయమంత్రులే అత్యధికం.

ఉత్తరాదికి పెద్ద పీట..!

మోడీ మంత్రివర్గంలో ఉత్తర్ప్రదేశ్ నుంచి అత్యధికంగా 10 మందికి మంత్రివర్గంలో చోటు దక్కింది. యూపీ వారణాసి నుంచి మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండగా, లఖ్నవూ ఎంపీ స్థానం నుంచి రాజ్నాథ్ సింగ్ గెలుపొందారు. ఏడుగురు మంత్రులతో యూపీ తర్వాత రెండోస్థానంలో మహారాష్ట్ర నిలిచింది. ఆరుగురు మంత్రులతో బిహార్కు మూడో స్థానం దక్కింది. గుజరాత్, రాజస్థాన్, హరియాణా, కర్ణాటక రాష్ట్రాల నుంచి ముగ్గురు చొప్పున మంత్రి మండలిలో అవకాశం లభించింది. బెంగాల్ , ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఇద్దరు చొప్పున మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

దక్షిణాదిలో కర్ణాటకకు మాత్రమే గుర్తింపు..!

దక్షిణాదిపై బీజేపీ వివక్ష చూపిస్తూందంటూ.. చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ స్వీప్ చేసిన రాష్ట్రాల్లో ఒకటైన.. కర్ణాటకకు… మూడు మంత్రి పదవులు ఇచ్చారు. అందులో కేబినెట్ హోదా ఉన్న పదవి కూడా ఉంది. మిగతావి సహాయమంత్రి పదవులు. తమిళనాడు, కేరళలకు ఓ సహాయమంత్రి పదవి లభించింది. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డికి.. కేబినెట్ బెర్త్ ఇస్తారనుకుంటే… సహాయమంత్రికే సరిపెట్టారు. కనీసం ఇండిపెండెంట్ చార్జ్ మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్కు మాత్రం.. ఎలాంటి పదవీ దక్కలేదు. ఈశాన్య రాష్ట్రాలు నాగాలాండ్, మణిపుర్, మిజోరం, సిక్కిం, త్రిపురలకు కూడా కేబినెట్‌లో చోటు దక్కలేదు.

ఒక్క మంత్రి పదవినీ వద్దన్న మిత్రుడు నితీష్..!

మోదీ కేబినెట్‌ లో శివసేన, అకాళీదళ్‌తో పాటు మిత్రపక్షాలన్నింటికీ ఒకే ఒక్క స్థానం దక్కింది. అయితే కేబినెట్‌లో సింగిల్‌ బెర్త్‌ ఇవ్వడంపై బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కేబినెట్‌లో చేరమంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్‌లో చేరకపోయినా… ఎన్డీయేలోనే కొనసాగుతామన్నారు నితీష్‌ కుమార్‌. త్వరలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో మోదీ కేబినెట్‌కు దూరంగా ఉంటామని నితీష్‌ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close