దర్శకుడు హరీష్ శంకర్ స్వతహాగా మంచి మాటకారి. నేల టికెట్ సినిమా ఆడియో ఫంక్షన్లో మరొకసారి తన మాటకారితనంతో కాసేపు సభను ఉర్రూతలూగించారు. దర్శకుడిగా పరిచయం చేసి సినీ పరిశ్రమలో రవితేజ జన్మనిస్తే, ఆ జన్మకు ఒక అర్థం పరమార్థం కలిగేలా పెద్ద హిట్ ఇచ్చి తన జన్మ సార్థకం చేసింది పవన్ కళ్యాణ్ అంటూ వ్యాఖ్యలు చేశారు హరీష్ శంకర్.
అలాగే పవన్ కళ్యాణ్, రవితేజ మధ్య సారూప్యతను వివరించాడు హరీష్ శంకర్. బోయపాటి, శ్రీను వైట్ల, తనలాంటి ఎంతోమంది దర్శకులను రవితేజ పరిచయం చేస్తే, కరుణాకరన్, పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులను పవన్ కళ్యాణ్ పరిచయం చేశాడని ఆ రకంగా ఆయా దర్శకులకు జీవితాంతం జీవితాంతం వీరు గుర్తుండిపోతారు అని వ్యాఖ్యానించాడు హరీష్ శంకర్.
అలాగే, గబ్బర్ సింగ్ విడుదల ఈరోజుకి ( మే 11) సరిగ్గా ఆరు సంవత్సరాలు అయిందని, అయినా కూడా నిన్న మొన్న ఆ సినిమా తీసినట్టు అనిపిస్తుంది అని గబ్బర్ సింగ్ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు హరీష్ శంకర్. అలాగే మొన్న విజయవాడలో పాదయాత్ర సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎండలో చెమట లో తడుస్తూ, పవన్ కళ్యాణ్ నడుస్తూ ఉంటే, ఇంత డబ్బు, పేరు ఇవన్నీ పక్కనపెడితే తను నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన చేస్తున్న యుద్ధంలో ఆయన తన లక్ష్యాన్ని చేరుకోవాలని కాంక్షించాడు హరీష్ శంకర్.