హీరోయిన్స్ స్కిన్ షో

బాబు బాగా బిజీ సినిమాలో అలాంటి సీన్స్‌లో ఎందుకు నటించారు అన్న ప్రశ్నకు అందరూ చెప్పే ఒక రొటీన్ సమాధానాన్ని అవసరాల శ్రీనివాస్ కూడా చెప్పాడు. ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్‌లో నటిస్తే మర్డర్స్ చేస్తామనా……ఇది కూడా జస్ట్ నటనలో భాగమే అని చెప్పాడు. ఆ విషయంలో శ్రీనివాస్ చెప్పింది కరెక్ట్. కానీ అవే మాటలను ఇంకో అర్థంలో తీసుకుంటే మర్డర్ సీన్స్‌ని రియలిస్టిక్‌గా తీయని మనవాళ్ళు సెక్స్ సీన్స్‌ని మాత్రం పూర్తిగా తెరపైన చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తు్నారు? ఇక్కడ కూడా నటనతోనే మేనేజ్ చేయలేరా? నటనతో శృంగారాన్ని పండించలేరా? హీరోయిన్స్ చేత…..ఇఫ్పుడు హీరోల చేత కూడా బట్టలు ఇప్పించేసి వెండితెరపై మొత్తం షో చేయాలా? మన దేశంలో ఉన్న ఎవరైనా ఇలాంటి వాదన తెస్తే ఇక హేతువాదులు, మోడర్న్ వాదులు….ఆ వాదులు, ఈ వాదులు అని బోర్డ్ పెట్టుకుని ఉన్న న్యూస్ ఛానల్స్‌లో టైం పాస్ చేస్తూ మేధావుల్లా బిల్డప్‌లు ఇచ్చే వాళ్ళందరూ కూడా బండ వాదనకు దిగుతారు. వాళ్ళకు అదో టైం పాస్ మరి. ఛాదస్తం ఉండకూడదు, అది కూడా నటనే అని చెప్పుకొస్తారు. వీళ్ళ దృష్టిలో పూనం పాండే, స్వాతి నాయుడు….ఇంకా ఆ లిస్టులో ఉన్న బోలెడుమందిది కూడా నటనేనా?

కాంబోడియాలో మరీ ఈ స్థాయిలో అని కాదుగానీ కాస్త ఓవర్ ఎక్స్‌పోజ్ చేసిన, స్కిన్ షో చేసిన ఒక నటిని ఏడాది పాటు నటించకూడదని నిషేధం విధించారు అక్కడ పాలకులు. దేశ సంస్కృతీ సాంప్రదాయాలను నాశనం చేస్తూ ఉందని చెప్పి నిషేదాన్ని అమలులోకి తెచ్చారు. ఆ నటి చేసిన ఎక్స్‌పోజింగ్‌ని మన బాలీవుడ్, టాలీవుడ్….ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో మన నటీమణులు(?) చేస్తున్న స్కిన్ షోతో పోలిస్తే నథింగ్ అనే చెప్పాలి. మరి మన దగ్గరే ఎందుకు పాలకులు అలాంటి నిర్ణయం తీసుకునే సాహసం చేయరు? మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందనా? స్వాతి నాయుడు, పూనం పాండే లాంటి వాళ్ళను శిక్షిస్తే మహిళల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు కానీ బిజెపి ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఇక సో కాల్డ్ హేతువాదులు, కాంగ్రెస్ వాదులు, కమ్యూనిస్ట్ వాదులందరూ కూడా కాషాయ సిద్ధాంతాలు రుద్దుతున్నారని గొడవ గొడవ చేయడం మాత్రం ఖాయం. విమర్శలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ మోడీ అయినా కాస్త ధైర్యంగా నటన పేరుతో జరుగుతున్న ఈ స్కిన్ షో వ్యాపారాన్ని కాస్తైనా కంట్రోల్ చేస్తే బాగుంటుందేమోననిపిస్తోంది. లేకపోతే మాత్రం త్వరలోనే……లిప్ కిస్సులు, బికినీలు అన్ని సినిమాల్లో కామన్ అయినట్టుగా న్యూడిటీ కూడా కామన్ అయిపోయే ప్రమాదం అయితే ఉంది. బండగా వాదించే హేతువాదులు, సంస్కరణవాదులు, మోడర్న్ వాదులకు అది ప్రమోదంగా కనిపిస్తే చేయగలిగింది ఏమీ లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.