క్రైమ్ : హోంగార్డు భార్య మర్డర్ “మిస్‌ఫైర్”

చేతిలో తుపాకీ ఉంది. ఎదురుగా చంపేయాలన్నంత కోపం తెప్పించిన భార్య ఉంది. అంతే ఆ ఆ పోలీసు ఏ మాత్రం ఆలోచించలేదు. కాల్చేశాడు. తర్వాత పోలీస్ బుర్రతోనే ఆలోచించారు. తుపాకీ మిస్ ఫైర్ అయిందంటూ నాటకం ప్రారంభించాడు. కానీ ఎంత పోలీస్ అయినా .. నేరం చేసి తప్పించుకోవాలనుకున్నప్పుడు ఎక్కడో ఓ చోట తడబడక తప్పదు. అలాగే ఆ పోలీస్ తడబడ్డాడు. అంతే దర్యాప్తు పోలీసులు పట్టుకున్నారు. అప్పుడు అతను నిజం ఒప్పుకోక తప్పలేదు. ఈ ఘటన బెజవాడలో జరిగింది.

బెజవాడలో వినోద్ అనే హోంగార్డు ఓ ఏఎస్పీ దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అతను రాత్రి ఇంటికి వచ్చాక ఇంట్లో నుంచి బుల్లెట్ శబ్దం వినిపించింది. అందరూ వచ్చి చూస్తే అతని భార్య కడుపులోకి బుల్లెట్ దిగింది. ఆమె అక్కడే చనిపోయినట్లుగా గుర్తించారు. హోంగార్డు వినోద్ కన్నీరుముననీరుగా విలపిస్తూ… భార్యకు గన్ ఎలా ఉంటుందో చూపిస్తున్నానని మిస్ ఫైర్ అయిందని చెప్పాడు. అందరూ అదే నిజం అనుకున్నారు. ఎందుకంటే ఆ భార్యభర్తులు ఇంటి గొడవల్ని ఎప్పుడూ బయట పెట్టుకోలేదు. అన్యోన్యంగానే ఉండేవారు. కానీ పోలీసులు మొత్తంగా విచారణ జరిపితే అసలు విషయం తెలిసింది. భార్య సూర్యరత్నప్రభ నగల్ని హోంగార్డు వినోద్ తాకట్టు పెట్టాడు. వాటి విషయంలో గొడవ జరిగింది. కోపం తట్టుకోలేక వినోద్ కాల్చేశాడు. వినోద్ భార్య ఇప్పుడు నాలుగు నెలల గర్భవతి.

సీఎం సెక్యూరిటీ వింగ్ ఏఎస్పీ దగ్గర అసిస్టెంట్‌గా హోంగార్డు వినోద్ పనిచేస్తున్నారు. 3 రోజుల క్రితం అనంతపురం క్యాంప్‌కు ఏఎస్పీ వెళ్లారు. ఆయన తుపాకీని హోంగార్డ్ వినోద్ దగ్గర ఉంచారు. ఆ తుపాకీతోనే దారుణానికి పాల్పడ్డాడు. మొదట వినోద్ చెప్పిన కథను చాలా మంది నమ్మారు. ఆయన భార్య తల్లిదండ్రులు కూడా నమ్మారు. తమ అల్లుడు మంచి వాడని పోలీసులుక చెప్పారు. కానీ విచారణలో అసలు విషయం తెలిసే సరికి వారే పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రమేష్ ఆస్పత్రికి రఘురామ..! హైకోర్టు ఆదేశాలనైనా పాటిస్తారా..?

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అయినా రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించకూడదనుకున్న సీఐడీ అధికారులు.. ప్రభుత్వానికి షాక్ తగిలింది. సీఐడీ కోర్టు ఆదేశించించినట్లుగానే.. రమేష్ ఆస్పత్రికి రఘురామకృష్ణరాజును తరలించాలని స్పష్టం చేసింది. గుంంటూరు ప్రభుత్వాసుపత్రిలో...

జైలుకు ఆర్ఆర్ఆర్.. కోర్టును లైట్ తీసుకున్న సీఐడీ..!

ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు కోర్టులను లెక్క చేయలేదు. ఎంపీ రఘురామకృష్ణరాజుకు వైద్యం అందించాలని ఇచ్చిన ఆదేశాలను పక్కన పెట్టేసి.. జిల్లా జైలుకు తరలించేశారు. ఆయనకు వైద్యం అందించే విషయంలోనే కాదు.. వైద్య నివేదిక...

టీవీ9 ప్రాథమిక నివేదిక.. ఆర్ఆర్ఆర్‌కి సొరియాసిస్..!

రఘురామకృష్ణరాజు కాళ్లకు ఉన్న దెబ్బల గురించి టెస్టులు చేసి నివేదిక ఇవ్వాలని సీఐడీ కోర్టు.. హైకోర్టులు ఆదేశించాయి. వైద్యులు నివేదికల కోసం.. కోర్టు ఇచ్చిన సమయం దాటి మరీ టెస్టులు చేస్తున్నారు. నివేదికలు...

రేవంత్‌కు పోలీసులే అలా ప్రచారం చేసి పెడతారు..!

హైదరాబాద్‌లో రూ. ఐదు రూపాయల భోజన కేంద్రాలయిన అన్నపూర్ణ క్యాంటీన్లు కొనసాగుతాయని మీడియాకు సమాచారం ఇచ్చిన తెలంగాణ సర్కార్.. నిజానికి ఆపేసింది. దాంతో పేదలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా చోట్ల టీఆర్ఎస్...

HOT NEWS

[X] Close
[X] Close