‘ఛ‌త్ర‌ప‌తి’లో భారీ మార్పులు

ప‌దిహేనేళ్ల క్రితం తెలుగులో విడుద‌లై.. మంచి విజ‌యాన్ని అందుకున్న సినిమా ‘ఛ‌త్ర‌ప‌తి’. ప్ర‌భాస్ స్టామినా ఏమిటో నిరూపించిన సినిమా ఇది. `ఛ‌త్ర‌ప‌తి` త‌ర‌వాత ప్ర‌భాస్‌ని ద‌ర్శ‌కులు చూసే కోణ‌మే మారిపోయింది. ఇప్పుడు.. ఇన్నాళ్ల‌కు ఈసినిమాని హిందీలో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ శ్రీ‌నివాస్ క‌థానాయ‌కుడు. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు ఇంకా ఖ‌రారు కాలేదు. కానీ చాలా పేర్లు బ‌య‌ట వినిపిస్తున్నాయి. సుజిత్‌, ప్ర‌భుదేవా, లింగు స్వామి.. వీళ్ల‌లో ఒక‌రు ద‌ర్శ‌కత్వం వ‌హించొచ్చు.  మొత్తానికి సౌత్ ఇండియన్ నుంచే ద‌ర్శ‌కుడ్ని ఖ‌రారు చేయొచ్చు.

అయితే ఈ సినిమా స్క్రిప్టులో చాలా మార్పులు చూసే అవ‌కాశాలున్నాయి. ‘ఛ‌త్ర‌ప‌తి’ రూప‌క‌ర్త విజ‌యేంద్ర ప్ర‌సాద్ కే ఈ మార్పుల బాధ్య‌త‌నీ అప్ప‌గించార్ట‌. ఆల్రెడీ ఆయ‌న స్క్రిప్టుని రీ రైట్ చేసే ప‌నిలో ప‌డ్డారు. ముఖ్యంగా ద్వితీయార్థంలో క‌థ‌ని మార్చ‌బోతున్నార్ట‌. ఇప్ప‌టికే `ఛ‌త్ర‌ప‌తి` విడుద‌లై 15 ఏళ్ల‌య్యింది. డ‌బ్బింగ్ రూపంలోనూ ఈ సినిమా చేసేశారు. కాబ‌ట్టి.. `ఛ‌త్ర‌ప‌తి` సినిమా చూసిన హిందీ ప్రేక్ష‌కుల‌కు సైతం కొత్త‌గా క‌నిపించేలా మార్పులు ఉండ‌బోతున్నాయ‌ట‌. ద్వితీయార్థంలో సెంటిమెంట్ డోసు.. తెలుగులో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. దాన్ని వీలైనంత త‌గ్గించి.. మాస్ ఎలిమెంట్స్ జోడించబోతున్నార‌ని స‌మాచారం. స్క్రిప్టు మొత్తం ఫైన‌ల్ అయ్యాక‌.. మ‌ళ్లీ ద‌ర్శ‌కుడి చేతిలో పెడ‌తారు. అందుకే స్క్రిప్టు పూర్త‌య్యేలోగా ద‌ర్శ‌కుడ్ని వెదికే ప‌నిలో ప‌డ్డారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close