అమరావతిలో టీడీపీ భారీ ఆఫీస్ రెడీ..!

ఘోరపరాజయం భారంలో ఉన్నప్పటికీ..భవిష్యత్‌పై.. ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీ.. అమరావతిలో భారీ కార్యాలయాన్ని నిర్మించుకుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. దీన్ని అమరావతికి తరలించకతప్పలేదు. ఇప్పటికే అక్కడ ఉన్న జిల్లా కార్యాలయాన్ని రాష్ట్ర కార్యాలయంగా చేశారు. కానీ అది సరిపోవడం లేదు. అందుకే.. మంగళగిరి సమీపంలో.. నాలుగున్నర ఎకరాల్లో .. కార్యాలయాన్ని నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ లో నిర్మాణం ప్రారంభించారు. ఏడాదిలోనే ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఆరో తేదీన.. ఈ వేడుక జరుగుతోంది. సరైన కార్యాలయం లేక ఇబ్బందులు పడుతున్న సమయంలో.. ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తే… సమస్యలు ఉండవని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బ్లాకులుగా నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ కంటే 5 రెట్లు పెద్దది.

ఈ కార్యాలయం.. టీడీపీకి దక్కకుండా ఉండేందుకు… ఏపీ సర్కార్ అన్ని రకాల చర్యలు ప్రారంభించింది. టీడీపీ కార్యాలయాన్ని నిర్మించిన స్థలం… ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నది. ఆ లీజును.. క్యాన్సిల్ చేయడానికి అవసరమైన ప్రయత్నాలను.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఇప్పటికే ప్రారంభించింది. రెవిన్యూ శాఖ ద్వారా నోటీసులు జారీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కార్యాలయంలో కొంత స్థలం.. ప్రభుత్వ పోరంబోకు స్థలంలో ఆఫీసు కట్టారని.. అలాగే ప్రైవేటు రైతుల స్థలాన్ని ఆక్రమించి ఆ కార్యాలయం కడుతున్నారని… ఇప్పటికే రెవిన్యూ అధికారులు నోటీసులు పంపించారు. ఇప్పుడు ప్రభుత్వ స్థలం లీజును క్యాన్సిల్ చేసి.. వెనక్కి తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే.. కేబినెట్ నిర్ణయం ప్రకారం.. టీడీపీకి లీజు కోసం స్థలం కేటాయించారు. మళ్లీ కేబినెట్ నిర్ణయం ప్రకారం క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. స్థలం కేటాయించిన సమయంలో.. పెట్టిన నిబంధనలు అతిక్రమిస్తేనే.. వాటిని క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే.. న్యాయస్థానంలో నిలబడవు. ఆ కోణంలో.. ఇప్పుడు ఏపీ అధికారులు.. టీడీపీ కార్యాలయం స్థలంలో నిబంధనలు ఏమైనా అతిక్రమించేరేమోనన్న ఉద్దేశంలో.. పరిశీలన జరుపుతున్నారు. ఈ కార్యాలయాన్ని ఎంతో కొంత వివాదాస్పదం చేయకుండా.. అయితే.. ఏపీ సర్కార్ వదిలి పెట్టే అవకాశం లేదని.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలతో తేలిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close