ఉగ్రవాదుల స్థావరాలపై విరుచుకు పడిన భారత్ దళాలు

పాకిస్తాన్ కి ఊహించని షాక్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. భారత ఆర్మీ కాశ్మీర్ సరిహద్దు వైపున్న లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద సుమారు 3 కి.మీ. లోపలకి భారత్ సైనికులు చొచ్చుకుపోయి అక్కడ 7 ఉగ్రవాదులు స్థావరాలని, సుమారు 35 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టారు. అర్ధరాత్రి తరువాత మొదలైన ఈ ఆపరేషన్ తెల్లవారు జమున 4.30 గంటల వరకు సాగింది. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న సైనికులని ఆర్మీ హెలికాఫ్టర్లలో ఆ ప్రాంతంలో పారాచూట్స్ ద్వారా జార విడిచారు. ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకొని అందరూ క్షేమంగా తమ క్యాంప్ కి చేరుకొన్నారు. ఈ ఆపరేషన్ లో భారత సైనికులు ఎవరూ గాయపడలేదని లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ (డిజిఎంఒ) మీడియాకి తెలిపారు. అక్కడ చాలా మంది ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు నిఘా వర్గాలు అందించిన సమాచారం ఆధారంగానే తాము ఈ ఆపరేషన్ నిర్వహించామని ఆయన చెప్పారు. మళ్ళీ మరోసారి అటువంటి మిలటరీ ఆపరేషన్ నిర్వహించే ఆలోచన లేదని చెప్పారు.

ప్రధాని నరేంద్ర మోడీ అనుమతితోనే ఈ ఆపరేషన్ నిర్వహించబడిందని వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు సాయంత్రం 4గంటలకి కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఈ ఆపరేషన్ గురించి, దానికి అనివార్యత గురించి వారికి వివరించబోతున్నారు.

దీనిపై భారత్ లో సర్వత్ర హర్షం వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పాకిస్తాన్ మండిపడింది. కానీ పాక్ భూభాగంలోకి భారత్ సైనికులు చొరబడి సర్జికల్ స్ట్రయిక్ చేశారని అంగీకరించడం లేదు. పాక్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ ఈ మెరుపు దాడులపై స్పందిస్తూ, “దానిని సర్జికల్ స్ట్రయిక్ గా మేము భావించడం లేదు. సరిహద్దుల వద్ద జరిగిన కాల్పులలో మా సైనికులు ఇద్దరు మరణించారు. కొందరు గాయపడ్డారు. మేము భారత్ తో శాంతి, స్నేహమే కోరుకొంటున్నాము. మా సహనాన్ని భారత్ అసమర్ధతగా భావించవద్దని హెచ్చరిస్తున్నాము. భారత్ అత్యుత్సాహం ప్రదర్శిస్తే దానిని ఎదుర్కోవడానికి మేము కూడా సిద్దంగానే ఉన్నాము,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పార్టీ వేరు.. ప్రభుత్వం వేరంటున్న ఆర్ఆర్ఆర్..!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు.. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో విందు భేటీ నిర్వహించారు. ఆయన రాజకీయం కొద్ది రోజులుగా బీజేపీ చుట్టూనే తిరుగుతోంది. మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా.. పొగుడుతూ...

“ఉస్మానియా” పాపం ప్రతిపక్షాలదేనా..?

ఉస్మానియా ఆస్పత్రి ఇప్పుడు తెలంగాణ రాజకీయాలకు కేంద్రంగా మారింది. బుధవారం పడిన వర్షానికి ఉస్మానియా మొత్తం నీళ్లు నిండిపోవడం.. చికిత్స గదుల్లో కూడా నీరు చేరడంతో.. విపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. ఐదేళ్ల...

సంతోష్ కుమార్ చాలెంజ్ అంటే స్వీకరించాల్సిందే..!

కొద్ది రోజులుగా మీడియాలో.. సోషల్ మీడియాలో ఓ వార్త రెగ్యులర్‌గా కనిపిస్తోంది. అదే.. ప్రభాస్.. బ్రహ్మానందం.. సమంత లాంటి స్టార్లు.. మొక్కలు నాటుతూ.. చాలెంజ్‌ను కంప్లీట్ చేయడం.. ఆ చాలెంజ్‌ను మరికొంత...

కరోనా రాని వాళ్లెవరూ ఉండరు : జగన్

భవిష్యత్‌లో కరోనా వైరస్ సోకని వాళ్లు ఎవరూ ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. ప్రస్తుతం కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయని.. ఎవరూ వాటిని ఆపలేరని వ్యాఖ్యానించారు. కరోనా ఆపడానికి...

HOT NEWS

[X] Close
[X] Close