పాక్ వ్యూహం ఫలించినట్లే ఉంది

ఊహించినట్లే పాకిస్తాన్ వ్యూహం ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం డిల్లీలో జరగవలసిన భారత్-పాక్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం రద్దు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇరు దేశాలమధ్య మళ్ళీ సంబంధాలు పునరుద్దరించుకొనే ప్రయత్నంలో ఈ సమావేశం నిర్వహించాలని భారత్, పాక్ ప్రధానులు మోడీ, నవాజ్ షరీఫ్ రష్యాలో కలిసినప్పుడు అంగీకరించారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తలు నెలకొన్న దృష్ట్యా ఈ సమావేశానికి చాలా ప్రాధాన్యత ఉంది. పాకిస్తాన్ నిజంగా శాంతి కోరుకొని ఉండి ఉంటే ఈ సమావేశానికి అనువయిన వాతావరణం కల్పించేందుకు తనవంతు కృషి చేసేది. కానీ ఇరు దేశాల ప్రధానులు రష్యాలో సమావేశం అవుతున్న సమయంలో కూడా భారత్-పాక్ సరిహద్దుల వద్ద పాక్ దళాలు భారత్ దళాలపై కాల్పులు జరుపుతూనే ఉన్నారు. అప్పటి నుండి నేటి వరకు ఆ కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. వాటికి అధనంగా పంజాబ్ మరియు జమ్మూలో పాక్ ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. అయినప్పటికీ భారత్ ఈ సమావేశాన్ని రద్దు చేయలేదు. కానీ ఈ సమావేశానికి హాజరయితే సరిహద్దులలో కాల్పుల గురించి, పంజాబ్, ఉదంపూర్ లలో ఉగ్రవాదుల దాడుల గురించి, పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది ఉస్మాన్ ఖాన్ గురించి భారత్ అడగబోయే అనేక ప్రశ్నలకు పాకిస్తాన్ జవాబులు, సంజాయిషీలు చెప్పుకోవలసి వస్తుంది. అందుకే పాక్ ఈ సమావేశాన్ని ఏదో విధంగా తప్పించుకొనేందుకు తనకు అలవాటయిన ఎత్తు వేసింది.

భారత్ అభ్యంతరాలను పట్టించుకోకుండా పాక్ హైకమీషనర్ అబ్దుల్ బాసిత్ గతేడాది కాశ్మీరీ వేర్పాటువాదులతో డిల్లీలో సమావేశమయినందుకు భారత్ ఆగ్రహించి ఇస్లామాబాద్ లో జరగవలసిన భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకొంది. కనుక ఇప్పుడు కూడా పాక్ మళ్ళీ అదే ఎత్తు వేసింది.

ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం కంటే ముందు పాక్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ కాశ్మీరీ వేర్పాటువాద సంస్థ హురియత్ నేతలతో డిల్లీలో పాక్ హై కమీషన్ కార్యాలయంలో సమావేశం అయ్యేందుకు నిశ్చయించుకొన్నారు. అందుకు భారత్ సహజంగానే తీవ్ర అభ్యంతరం చెప్పింది. కానీ హురియత్ నేతలతో సమావేశం అయ్యి తీరుతామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఊహించినట్లే ఈసారి కూడా భారత్ సోమవవారం జరగవలసిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశాన్ని రద్దు చేసుకొనేందుకు ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం.

పాక్ కోరుకొంటున్నది కూడా అదే. తన చేతికి మట్టి అంటకుండా భారత్ తనంతట తానే ఏకపక్షంగా ఈ సమావేశాన్ని రద్దు చేసుకొన్నట్లయితే భారత్ కి సంజాయీషీలు చెప్పుకొనే బాధ తప్పుతుంది. అలాగే తాము భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను పునరుద్దరించుకోవాలని గట్టిగా కోరుకొంటున్నప్పటికీ భారత్ ఏదో ఒక కుంటిసాకులు చూపిస్తూ ఈసారి కూడా ఏకపక్షంగా సమావేశాన్ని రద్దు చేసుకొందని తిరిగి భారత్ ని నిందించవచ్చును. అంతేకాదు, తమదేశాన్ని అప్రదిష్ట పాలుజేసేందుకే భారత్ ఇటువంటి కుటిల ఆలోచనలు చేస్తోందని అంతర్జాతీయ వేదికల మీద భారత్ ని నిందించే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఈ సమావేశం రద్దు అయ్యేందుకు భారత్ ని ఎంతగా రెచ్చగొట్టవచ్చో అన్ని ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తోంది. భారత్ స్నేహ హస్తం అందిస్తున్నప్పుడు దానిని అందుకొని తన దేశంలో కూడా అభివృద్ధి సాధించుకొనే ప్రయత్నం చేయకపోగా అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని చేజేతులా చెడగొట్టుకొనే ప్రయత్నాలు చేస్తోంది. అది ఆ దేశ ప్రజల దురదృష్టమే తప్ప భారత్ ది కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తేగేదాకా లాగుతున్న సర్కార్-ఎస్‌ఈసీ..!

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగసంక్షోభ సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం.. అధికారులు సహకరించడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. అదే సమయంలో ఎస్‌ఈసీ...

గ్రేటర్ పీఠం కైవసానికి టీఆర్ఎస్ స్కెచ్ రెడీ ..!

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవిని అలా వదిలేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి పెద్దలకు మనస్కరించలేదు. ఎలాగోలా పీఠంపై గులాబీ నేతను కూర్చోబెట్టాల్సిందేనని డిసైడయ్యారు. ఎన్నికలు ముగిసి చాలా కాలం అవుతున్నా.. పాత కార్యవర్గానికి...

ధిక్కరణకే సర్కారు మొగ్గు..!

పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎస్‌ఈసీకి సహకరించకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ మేరకు అధికారులకు తేల్చి చెప్పడంతో వారెవరూ.. ఎస్‌ఈసీతో కనీసం సమావేశానికి కూడా ఆసక్తి చూపడంలేదు. పంచాయతీ...

వెంటిలేటర్‌పై శశికళ..!

ఇరవై ఏడో తేదీన చిన్నమ్మ విడుదలవుతుంది.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దున్ని పారేస్తుందని... తమిళ మీడియా జోరుగా విశ్లేషిస్తున్న సమయంలో అనూహ్యంగా శశికళ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆమెకు శ్వాస సమస్య...

HOT NEWS

[X] Close
[X] Close