‘ఆర్.ఆర్.ఆర్’ తరవాత రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చేశాడు. ఎన్టీఆర్ నుంచి ‘వార్ 2’ వచ్చింది. రెండూ నిరాశ పరిచాయి. అందుకే ఈసారి చేస్తున్న ప్రాజెక్టుల మీద ఇద్దరు హీరోలూ గట్టి ఫోకసే పెట్టారు. చరణ్ ‘పెద్ది’ని రెడీ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఏమో ‘డ్రాగన్’పై దృష్టి పెట్టాడు. డ్రాగన్ కు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు.
ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ వదులుతారని తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ మాత్రం టీజర్ లాంటిదేమైనా ఉంటుందని ఆశిస్తున్నారు. చిత్రబృందం కూడా ఆ దిశగా దృష్టి నిలిపిందని సమాచారం. ‘డ్రాగన్’ నుంచి ఎన్టీఆర్ బర్త్ డేకి ఓ గ్లింప్స్ బయటకు వచ్చే ఛాన్సుంది. దానికి సంబంధించిన వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ ఈ గ్లింప్స్ ఉండొచ్చు. ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ ప్రపంచాన్ని ఈ గ్లింప్స్ తో పరిచయం చేసే అవకాశం ఉంది.
ఇంత వరకూ ‘డ్రాగన్’ కాన్సెప్ట్ ఏమిటన్నది బయటకు రాలేదు. నిజానికి టైటిల్ కూడా అధికారికంగా ప్రకటించలేదు. ఎన్టీఆర్ బర్త్ డేకి ఈ విషయాలపై ఓ క్లారిటీ వస్తుంది. ‘డ్రాగన్’ అనేది డ్రగ్ మాఫియాకు చెందిన కథ అని తెలుస్తోంది. గ్లింప్స్ లో ఆ ఛాయలేమైనా కనిపిస్తాయేమో చూడాలి.
