ఇస్మార్ట్‌లో ‘బూతు’ గోల ఎక్కువైందా?

‘ఇస్మార్ట్ శంక‌ర్’ ట్రైల‌ర్‌, టీజ‌ర్‌లు కాస్త హాట్ హాట్‌గానే ఉన్నాయి. పూరి డైలాగుల్లో మ‌సాలా బాగా ద‌ట్టించాడు. అయితే ఆ డోసు సినిమాల్లో ఇంకాస్త ఎక్కువ‌గానే ఉన్న‌ట్టు టాక్‌. రామ్ డైలాగులు ఎక్కువ‌గా డ‌బుల్ మీనింగ్ కోణంలోనే ఉంటాయ‌ట‌. కొన్ని ముత‌క సామెత‌ల్ని మ‌రింత నాటుగా ఈ సినిమాలో ప‌లికిన‌ట్టు తెలుస్తోంది. (పిల్లి గుడ్డిదైతే.. ఎల‌క‌….. లాంటివి ట్రైల‌ర్‌లో వినిపించాయి కూడా). ఈ విష‌యంలో రామ్‌తో పాటుగా న‌భా న‌టేషా కూడా వాటాకొచ్చింద‌ని స‌మాచారం. న‌భా ఇందులో తెలంగాణ పోరిగా క‌నిపించింది. త‌ను కూడా కొన్ని డ‌బుల్ మీనిండ్ డైలాగుల్ని ఎదేఛ్ఛ‌గా చెప్పింద‌ట‌. దాంతో పాటు ఒక‌ట్రెండు హాట్ సీన్లు కూడా ఈ సినిమాలో ఉన్నాయ‌ని స‌మాచారం. పూరి సినిమాల్లో డైలాగులు స్ట్రైట్ ఫార్వ‌ర్డ్‌గా ఉంటాయి. కాక‌పోతే.. ఇంత నాటుగా ఎప్పుడూ వాడ‌లేదు. తొలిసారి పూరి త‌న నాటు స్టైల్ చూపించ‌బోతున్నాడు. వీటిలో కొన్ని డైలాగులు, సీన్లు సెన్సార్ క‌త్తిర్ని దాటుకుని రావ‌డం అనుమాన‌మే అని తెలుస్తోంది. కాక‌పోతే ఈమ‌ధ్య సెన్సార్ కాస్త చూసీ చూడ‌న‌ట్టు ప్ర‌వ‌ర్తిస్తోంది. `ఫ‌ల‌క్‌నామా దాస్` లాంటి సినిమాలే అందుకు సాక్ష్యం. పూరి కూడా సెన్సార్ బోర్డుని ఏదోలా ఒప్పించి – త‌న డైలాగుల్నీ, సీన్ల‌నూ పాస్ చేయించుకోవాల‌ని చూస్తున్నాడు. ఏమైనా ఈ సినిమాకి `ఏ` స‌ర్టిఫికెట్ రావ‌డం ఖాయంలానే క‌నిపిస్తోంది. సోమ‌, మంగ‌ళావ‌రాల్లో `ఇస్మార్ట్‌` సెన్సార్ ముందుకు వెళ్ల‌నుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close