పనామా ఖాతాదారులకు ఐటి శాఖ నోటీసులు

ఇంతవరకు భారత్ లో ఎన్ని కుంభకోణాలు జరిగాయో లెక్కే లేదు. అవి బయటపడిన తరువాత వాటి గురించి కొన్ని రోజులు అందరూ చర్చించుకొంటారు. కొన్ని రోజుల తరువాత దానిపై అందరూ ఆసక్తి కోల్పోతారు. తరువాత మళ్ళీ మరో కుంభకోణం..దానిపై మళ్ళీ చర్చ..మరిచిపోవడం..మళ్ళీ మరొకటి…అంతా రొటీన్. ఆ జాబితాలో ఇప్పుడు పనామా పేపర్స్ వచ్చి చేరింది. అందులో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా బచ్చన్ వంటి అందరికీ బాగా తెలిసిన పేర్లు బయటపడటంతో మళ్ళీ హడావుడి, చర్చలు, ఖండనలు అన్నీ షరా మామూలుగా జరిగిపోయాయి. ఈసారి వేసవి వేడి ఎక్కువగా ఉన్నందునేమో పనామా వేడిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారం రోజులకే ఆ వేడి తగ్గిపోయింది. అయితే ఇటువంటి వ్యవహారాలలోనే ఐటి శాఖకు నాలుగు రాళ్ళూ రాలే అవకాశం కనిపిస్తోంది కనుక ఎవరు పట్టించుకొన్నా కోకపోయినా అది మాత్రం పనామా ఖాతాదారులను గుర్తుంచుకొని, అందరికీ నోటీసులు పంపుతున్నట్లు తాజా సమాచారం. భారత్ లో 500 మంది పనామా ఖాతాదారులున్నట్లు ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రకటించి ఐటి శాఖ పని సులువు చేసింది కనుక ఆ జాబితాలో పేర్లున్న 50 మందికి నోటీసులు పంపి సంజాయిషీ కోరింది. వారి సమాధానాలు బట్టి తదుపరి చర్యలు ఉంటే ఉండవచ్చును లేకపోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే విదేశాలలో నల్లదనం దాచుకొన్నవారి చేత ఆ డబ్బు అంతా కక్కిస్తానని మోడీ చేసిన శపధానికే అతీగతీ లేదు. ఆ నల్లధనాన్ని వెనక్కి రప్పించలేకపోయినా దానిని వైట్ గా మార్చుకోవడానికి దారి చూపించారు కనుకనే రాహుల్ గాంధి దానికి ‘ఫెయిర్ అండ్ లవ్లీ స్కీం’ అని పేరుపెట్టి వెక్కిరిస్తున్నారు. కనుక దీనికీ అటువంటి తరుణోపాయమేదో చూపించినా ఆశ్చర్యం లేదు. కనుక రాహుల్ గాంధి దీనికీ ఓ మంచి పేరు సెలెక్ట్ చేసి ఉంచుకొంటే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీకి షాక్… పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల‌పై సీఈసీ స్ప‌ష్ట‌త‌

ఏపీలో రెండు మూడు రోజులుగా చ‌ర్చ‌నీయాంశం అయిన పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్ల వ్యాలిడిటీపై స్ప‌ష్ట‌త వ‌చ్చేసింది. పోస్ట‌ల్ బ్యాలెట్ల విష‌యంలో చాలా చోట్ల రిట‌ర్నింగ్ అధికారులు సంత‌కం చేసినా, సీల్ వేయ‌లేదు. కొన్ని...

సుధీర్ బాబు బిరుదు మారింది

మ‌న హీరోలంద‌రికీ పేరుకు ముందు ఏదో ఓ బిరుదు త‌గిలించుకోవ‌డం అల‌వాటు. ఒక‌వేళ వాళ్ల‌కు ఇష్టం లేక‌పోయినా, ఫ్యాన్సూ, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ త‌గిలించేస్తుంటారు. సుధీర్ బాబుకీ ఓ బిరుదు ఉంది. నైట్రో స్టార్...
video

‘హరోం హర’ ట్రైలర్: కుప్పంలో ఆయుధ పూజ

https://youtu.be/fnef0Uvvx1I?si=7BScZ4oy9zD2DSxc సుధీర్ బాబు 'హరోం హర' సినిమాతో రాబోతున్నాడు. సేహరి సినిమా తీసిన జ్ఞాన సాగర్ ద్వారక ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, పాటలు వచ్చాయి కానీ కథ...

శర్వానంద్.. ఓ పెళ్లి పాట

శర్వానంద్ 'మనమే' రావడానికి ఇంకా వారం రోజులే వుంది. ఇప్పటికే కొంత ప్రమోషనల్ కంటెంట్ బయటికి వచ్చింది. ఇప్పుడు టప్పా టప్పా అనే పాట ని వదిలారు. ఇదొక పెళ్లి పాట. ట్యూన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close