పార్టీ నాయకుడి ముందు కార్యకర్తల్ని సెక్యూరిటీ కొడుతూంటే.. ఆ నాయకుడు వెంటనే స్పందించి ఆపుతాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రత్యేకం. తన సెక్యూరిటీనే కదా తన కార్యకర్తల్ని కొడుతోంది అని చిద్విలాసంగా చూస్తారు. అనంతపురంలో అదే జరిగింది.
జగన్ రెడ్డికి ఇటీవల ఆత్మన్యూనత ఎక్కువైపోయింది. అన్న పెళ్లికి వస్తున్నాడు .. జన సమీకరణ చేయండని పార్టీ నేతలకు సమాచారం ఇస్తారు. పార్టీ కార్యక్రమాలంటే సరే.. ఇక పెళ్లిళ్లకు ఎందుకన్న డౌట్ చాలా మందికి వస్తుంది. అది అంతే.. జగన్ వచ్చినప్పుడు ఆయనను చుట్టుముట్టి జనం ఉండకపోతే ఎవరూ పట్టించుకోలేదని అనుకుంటారని ఆయన ఫీలవుతారు. అందుకే జన సమీకరణ చేస్తున్నారు.
అలా వచ్చిన వారు జగన్ దగ్గరకు వస్తే కొట్టేందుకు ఇప్పుడు సెక్యూరిటీని పెట్టుకున్నారు. అనంతపురం పెళ్లికి వెళ్తే ప్రైవేటు సెక్యూరిటీ రోప్ పార్టీగా ఉన్నారు. రోప్ దగ్గరకు వచ్చి జగన్ తో షేక్ హ్యాండ్ కు ప్రయత్నిస్తున్నారని కార్యకర్తల్ని చితకబాదేశారు. జగన్ ఆపమని కూడా చెప్పలేదు. అలాచూస్తూండిపోయారు. కార్యకర్తల్ని కొట్టి దారిస్తే….ఆ దారిలో వెళ్లిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కానీ తన కోసం పెద్ద ఎత్తున జనం వచ్చారని.. ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో చూపించుకున్నారు. మోకాళ్ల దండాలు పెట్టేవాళ్లున్నారని ఫోటోలు తీయించుకున్నారు. వారు జగన్ రెడ్డికి పావులు మాత్రమేనని కొడుతూంటే ఆపకపోవడంతోనే తేలిపోయిందని ఆ పార్టీ నేతలు నిట్టూరుస్తున్నారు.