“రాజదాని భూముల”పై సీబీఐ విచారణ కోరిన ఏపీ సర్కార్..!

రాజధాని భూముల విషయంలో అక్రమాలు జరిగాయంటూ.. ఆరోపణలు చేస్తున్న వైసీపీ సర్కార్.. వాటిపై విచారణ జరిపించాలంటూ.. సీబీఐకి సిఫార్సు చేసింది. ఈ మేరకు.. హోంశాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు. కేబినెట్ సబ్ కమిటీ.. రాజధాని భూముల క్రయ, విక్రయాల్లో అక్రమాలు గుర్తించిందని.. దాని ప్రకారం.. కొన్ని కేసులు నమోదుచేశామని.. .ఆ జీవోలో పేర్కొన్నారు. ఆ కేసులపై విచారణ జరపాల్సిందిగా.. సీబీఐకి సిఫార్సు చేస్తూ.. హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అధికారయంత్రాంగం అంతా కరోనా నివారణ చర్యల్లో ఉంది. అయితే.. అనూహ్యంగా ఏపీ సర్కార్.. కరోనాపైనే కాదు.. ప్రతిపక్షాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నామని తాజా జీవో ద్వారా నిరూపించినట్లయింది.

రాజధాని భూముల్లో అక్రమాలంటూ వైసీపీ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి విమర్శలు .. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అయినప్పటికీ.. ఇప్పటి వరకూ.. ఏ చర్యలూ తీసుకోలేకపోయారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని.. బినామీ ఆస్తులని చాలా ఆరోపణలు చేశారు కానీ… నిరూపించలేకపోయారు. కేబినెట్ సబ్ కమిటీ.. మొత్తం నాలుగు వేల ఎకరాలకుపైగా.. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని నివేదిక ఇచ్చింది. అయితే.. ఈ ఎకరాలు మొత్తం… రాజధాని పరిధిలో లేనివే. వీటిపై ప్రభుత్వం సీఐడి విచారణ జరిపించింది. ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాలను నియమించింది. వారు.. భూముల అమ్మకం దార్లు.. కొనుగోలు దారుల వారీగా.. ఇళ్లకు వెళ్లి విచారణ జరిపారు. సోదాలు చేశారు. సిట్ ఏర్పాటు చేసిన కొద్ది రోజులుపాటు వారు సోదాలు చేశారు కానీ.. ఏమీ తేల్చలేదు.

హఠాత్తుగా ప్రభుత్వం సీబీఐ విచారణకు కేంద్రానికి సిఫార్సు చేసింది. గతంలో.. గురజాలలో అక్రమ మైనింగ్ కేసులో.. యరపతినేనిపై సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తూ.. ఏపీ సర్కార్ కేంద్రానికి లేఖ రాసింది. ఆ కేసులో ఇంకా సీబీఐ విచారణ ప్రారంభం కాలేదు. తాజాగా రాజధాని భూములపైనా విచారణ కోసం సీబీఐకి సిఫార్సు చేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కోర్టు కూడా.. మూడు అంశాల్లో సీబీఐ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆయేషా మీరా కేసు.. అక్రమ నిర్బంధం కేసులో గుంటూరులో ఓ ఎస్పీ పై విచారణ.. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....
video

ఈదేశం విడిచి వెళ్లిపోండి.. లేదా చ‌చ్చిపోండి!

https://www.youtube.com/watch?v=nb-XDZQSZhE చాలా కాలంగా నారా రోహిత్ నుంచి సినిమాలేం రాలేదు. సుదీర్ఘ విరామం త‌ర‌వాత ఆయ‌న‌.. 'ప్ర‌తినిధి 2' తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఓర‌కంగా క‌రెక్ట్ కమ్ బ్యాక్ ఇది. ఎందుకంటే నారా రోహిత్ చేసిన...

‘టిల్లు స్వ్కేర్’ రివ్యూ: మ్యాజిక్ రిపీట్స్

Tillu Square movie review తెలుగు360 రేటింగ్ : 3/5 కొన్ని పాత్ర‌లు, టైటిళ్లు... ఆయా న‌టీన‌టుల కెరీర్‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారిపోతుంటాయి. 'డీజే టిల్లు' అలాంటిదే. ఈ సినిమా 'మామూలు' సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌ని 'స్టార్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close