మీడియా వాచ్ : ‘స్టార్ మా’… జియో వ‌శం?

జియో ఇప్పుడు ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంపై క‌న్నేసింది. టీవీ ఛాన‌ళ్లు, ఓటీటీ సంస్థ‌ల్ని గంప గుత్త‌గా ద‌క్కించుకోవాల‌ని భారీ ప్ర‌ణాళిక‌లు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా `స్టార్ మా`ని కొనుగోలు చేయ‌డానికి ముందుకొచ్చింది. ప్ర‌స్తుతానికి స్టార్ మాకీ, జీయోకీ మ‌ధ్య చ‌ర్చ‌లు సాగుతున్నాయి. జియో ఎప్పూడూ ఊరించే ప్యాకేజీల‌తోనే వ‌స్తుంటుంది. స్టార్ మాకి ఈ ఆఫ‌ర్ చాలా టెమ్టింగ్ గా క‌నిపిస్తోంద‌ట‌. ఏ క్ష‌ణ‌మైనా స్టార్ మా.. జియో చేతికి వెళ్లిపోవ‌చ్చ‌న్న‌ది ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌.

థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌పై కూడా జియో దృష్టి సారించింద‌ని స‌మాచారం. పీవీఆర్‌, ఏసియ‌న్‌, జీవీకే లాంటి మ‌ల్టీప్లెక్స్ సంస్థ‌ల్ని.. జియో కొనుగోలు చేయాల‌ని చూస్తోంది. ఇందుకు సంబంధించిన చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. అటు థియేట‌ర్లు, ఇటు ఛాన‌ళ్లు, మ‌రోవైపు ఓటీటీలూ.. ఇలా ఎక్క‌డ చూసినా జియోనే క‌నిపించ‌డం ఒక్క‌టే ల‌క్ష్యం. టెలికాం వ్య‌వ‌స్థ‌పై ఎలాగైతే.. గుత్తాధిప్యంగా ఆదిప‌త్యం చ‌లాయిస్తుందో.. అలానే ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగాన్ని గుప్పెట తీసుకోవాల‌ని జియో విశ్వ ప్ర‌య‌త్నం చేస్తోంది. వీటి ప‌రిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close