చివ‌రికి వ‌రుణ్‌తేజ్‌ని ముంచేశారు!

గాండీవ‌ధారి అర్జున‌… వ‌రుణ్ తేజ్ కెరీర్‌లోనే పెద్ద డిజాస్ట‌ర్‌. గ‌ని కూడా ఫ్లాప్ అయ్యింది కానీ, ఈ రేంజ్ లో న‌ష్టాల్ని తీసుకురాలేదు. నాన్ థియేట‌రిక‌ల్ రైట్స్ రూపంలో ఎంతో కొంత వెన‌క్కి వ‌చ్చింది కానీ, లేదంటే నిర్మాత నిండా మునిగేవాడే.

ఈ సినిమాతో వ‌రుణ్ తేజ్ కూడా వెన‌కేసిందేం లేదు. ఈ సినిమాకి ముందు వ‌రుణ్‌కి రూ.12 కోట్లు పారితోషికం ఇస్తామ‌న్నారు. బ‌డ్జెట్ ఎక్కువ‌య్యేస‌రికి రూ.8 కోట్ల‌కు త‌గ్గింది. సినిమా క్వాలిటీ కోసం త‌న పారితోషికాన్ని త్యాగం చేశాడు వ‌రుణ్‌. తీరా చివ‌రికి వచ్చే స‌రికి కేవ‌లం రూ.5 కోట్ల‌తో స‌రిపెట్టారు. సినిమా ఫ్లాప్ అయ్యే స‌రికి వ‌రుణ్ కూడా ఏం అడ‌గ‌లేక‌పోయాడు. విష‌యం ఏమిటంటే… ఈ సినిమాతో ద‌ర్శ‌కుడు ప్ర‌వీణ్ స‌త్తారు ఏకంగా రూ.4 కోట్లు పారితోషికం అందుకొన్నాడు. ప్ర‌వీణ్ తో పోలిస్తే.. వ‌రుణ్‌కి కోటి రూపాయ‌లు మాత్రం అద‌నంగా ల‌భించింద‌న్న‌మాట‌. గ‌ని ఫ్లాప్ అయినా వ‌రుణ్ కి రూ.10 కోట్ల వ‌ర‌కూ పారితోషికం ఇవ్వ‌డానికి నిర్మాత‌లు ముందుకొస్తున్నారు. త‌న సినిమాకి నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో మంచి మొత్త‌మే వ‌స్తుంది. అలాంటి ద‌శ‌లో రూ.5 కోట్ల‌కు సినిమా చేశాడంటే… వ‌రుణ్ మ‌రో రూ.5 కోట్లు న‌ష్ట‌పోయిన‌ట్టే లెక్క‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా ఫిక్స్ అయిపో..!?

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పద్మనాభం అని కాకుండా పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటానని సవాల్ చేశారు. ముద్రగడ ధీమా ఏంటో...

నన్ను పట్టించుకోరా… ఓ తండ్రి అనూహ్య నిర్ణయం

కని పెంచిన కొడుకులు పట్టించుకోలేదని నిరాశ చెందిన ఓ తండ్రి అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. రెక్కల కష్టంతో పెంచిన కొడుకులు తనను పట్టించుకోవడం లేదనే ఆగ్రహంతో యావదాస్తిని కొండగట్టు ఆంజనేయ స్వామికి సమర్పించేందుకు...

డైరెక్ట‌ర్స్ డే… రాజ‌మౌళి ‘డాన్స్’ షో!

ద‌ర్శ‌క దిగ్గ‌జం దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని, తెలుగు ద‌ర్శ‌కులంతా క‌లిసి 'డైరెక్ట‌ర్స్ డే'ని సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. మే 4న ఈ కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రగ‌బోతోంది. అందుకోసం ద‌ర్శ‌కులంతా క‌లిసి క‌స‌ర‌త్తులు చేస్తున్నారు....

ఏప్రిల్‌ బాక్సాఫీస్ రివ్యూ: అంతా చ‌ప్పచ‌ప్ప‌గా!

2024లో అప్పుడే 4 నెల‌లు గ‌డిచిపోయాయి. జ‌న‌వ‌రి సంక్రాంతి సినిమాల ద‌య వ‌ల్ల `ఓకే` అనిపించుకొంది. ఫిబ్ర‌వ‌రిలో అన్నీ ఫ్లాపులే. మార్చి కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించింది. ఓం భీమ్ భుష్‌, ప్రేమ‌లు, టిల్లూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close