చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే తన భార్య నిలదీసిందని జోగి రమేష్ ఓ మీడియాకు ఇంటర్యూ ఇచ్చి బాధపడ్డారు. చంద్రబాబుపై ఇంటిపై దాడికి వెళ్లడం, ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం, పవన్ కల్యాణ్ పై చేసిన ఘోరమైన వ్యాఖ్యలు, అసెంబ్లీలో స్వయంగా రఘురామకృష్ణరాజుపై అత్యంత దారుణమైన పదజాలం లాంటివి ఆయన భార్య చూడలేదేమో కానీ.. ఆయన మాత్రం భయంతో ప్రభుత్వాన్ని జోకే ప్రయత్నం చేస్తున్నారు.
ఆయన ఇతర వ్యవహారాల సంగతేమిటో కానీ అగ్రిగోల్డ్ భూముల్ని అడ్డగోలుగా కొట్టేసి అమ్మేసుకున్న వ్యవహారం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. అన్ని రకాల నివేదికలు సిద్ధమయ్యాయి. ఆయన అతి తెలివితో ఓ లావాదేవీని తన కుమారుడి పేరు మీద నడపడంతో ఇప్పిటికే ఆయన ఓ సారి జైలుకెళ్లి వచ్చారు. ఎమ్మెల్యేను చేస్తారని అనుకుంటే మొదటగా జైలుకు పంపడంతో ఆ కొడుకు నిరాశకు గురి అయి ఉంటాడు. ఇప్పుడు ఆ మొత్తం భూ వ్యవహారంలో జోగి రమేష్ సహా పలువురు వైసీపీ నేతలు ఉన్నారు.
పూర్తి స్థాయి నివేదిక రెడీ అవడంతో నేడో రేపో చర్యలు తీసుకోడవం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే.. ప్రభుత్వాన్ని జోకేందుకు రెడీ అయ్యారు. అమరావతికి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇవాళో రేపో ఆయన తమ బూతులకు కారణం వైసీపీ పెద్దలేనని పదవులు ఇస్తామన్న ఆశతో అలా చేశామని బాధపడిపోయినా ఆశ్చర్యం ఉండదన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుత వివాదంలోనూ ఆయన సాక్షి పై విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే జోగి ఎంత జోకినా .. జరగాల్సినవి మాత్రం జరుగుతూనే ఉంటాయని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అందుకే అటూ ఇటూ కోల్పోకుండా.. ఒకే స్టాండ్ మీద ఉంటే.. కనీసం జగన్ సానుభూతి ఉంటుందని సలహాలిస్తున్నారు. మరి జోగి ఏం చేస్తారో ?