ప్రకృతి విపత్తు లాస్ ఏంజెల్స్‌ను కొన్నాళ్ల పాటు బుగ్గిగా మారిస్తే.. ఇప్పుడు ఆ బాధ్యతను అధ్యక్షుడు ట్రంప్, ఎఫ్‌బీఐ డైరక్టర్ కాష్ పటేల్ తీసుకున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ తగలబడిపోతోంది. నిరసనకారులకు, నేషనల్ గార్డ్స్ మధ్య లాస్ ఎంజెల్స్ నలిగిపోతోంది. సింపుల్ గా పరిష్కారం అవ్వాల్సిన సమస్యను ట్రంప్, కాష్ పటేల్ కలిసి.. పెట్రోల్ పోసి తగలబడిపోయేంతలా చేశారు.
ICEపై తీవ్ర వ్యతిరేకత
లాస్ ఏంజెల్స్ లో ఇటీవల అక్రమంగా పని చేస్తున్న వారిని పట్టుకునేందుకు ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్స్మెంట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఐస్ చేయాల్సిన పని ఏమిటంటే..ఎరైనా అక్రమంగా నివసిస్తున్నా, పని చేస్తున్నా వారిని పట్టుకుని దేశం బయటకు గెంటేయడం. వీరి వల్ల అనేక రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా ఐదు రోజుల కిందట లాస్ ఏంజెల్స్ ఫ్యాషన్ డిస్ట్రిక్ట్‌లో దుకాణాల వద్ద దాడులు చేశారు. 44 మందిని అడ్మినిస్ట్రేటివ్ అరెస్టు చేశారు.
గవర్నర్ అనుమతి లేకుండా నేషనల్ గార్డ్స్ ను పంపిన ట్రంప్
ఈ పరిణామంతో లాస్ ఏజెంల్స్ లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు నిరసన కారులపై రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. పరిస్థితిని సద్దుమణిగేలా చేయడానికి లాస్ ఏంజెల్స్ పోలీసులు ప్రయత్నిస్తున్న సమయంలో ట్రంప్ నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దింపారు. దీన్ని లాస్ ఏంజెల్స్ గవర్నర్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాల హక్కుల్లోకి చొరబడుతున్నారని మండిపడ్డారు. అయితే ట్రంప్ కానీ.. ఎఫ్‌బీఐ డైరక్టర్ కానీ పట్టించుకోలేదు. పైగా గవర్నర్ ను అవమానించారు.
అమెరికా వ్యాప్తంగా అల్లర్లు విస్తరించే ప్రమాదం
ఇప్పుడు లాస్ ఏంజెల్స్ తగలబడుతోంది. అమెరికా వ్యాప్తంగా ఐస్ పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ అల్లర్లు అమెరికా అంతటకు పాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో అమెరికా కల్లోలిత దేశాల్లో ఒకటిగా మారడం ఖాయమన్నారు ఆందోళన కనిపిస్తోంది. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాలు, మాస్ డిపోర్టేషన్లు , బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌ను రద్దు చేసే ప్రతిపాదనలతో ఒక్క సారిగా ప్రజల్లో అసహనం పెరుగుతోంది. ట్రంప్ పరిపాలనా తీరు ప్రజల్ని తిరుగుబాటు చేసేలా చేస్తోంది.