జూన్ 3 రిలీజ్ అంటున్నారు.. ఇదైనా నమ్మొచ్చా..?

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినికాంత్ నటిస్తున్న సినిమా ‘కబాలి’. పా.రంజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి అంచనాలు అదరగొడుతుంది. ఇక కొచ్చాడియన్, లింగా సినిమాల షాక్ లో ఉన్న రజిని రాబోతున్న కబాలితో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనుకుంటున్నాడు. భాషా తర్వాత రజిని నటిస్తున్న మాఫియా డాన్ సినిమాగా అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడేలా చేసింది ఈ చిత్రం. అయితే సినిమా ఎక్కువ భాగం మలేషియాలో షూట్ చేయడం వల్ల సినిమాను అనుకున్న టైంకు తీసుకురాలేకపోతున్నారు దర్శక నిర్మాతలు.

కబాలి ఏప్రిల్ నెలలో వస్తుంది ముందు ఎనౌన్స్ చేశారు. ఇక మే నెలలో అయినా వస్తుందా అంటే కష్టమే అంటున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్ ను జూన్ 3న ఫిక్స్ చేశారని కోలీవుడ్ టాక్. మే 1న ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారట. కళైపులి ఎస్. థను నిర్మిస్తున్న ఈ సినిమాలో రాధికా ఆప్టె హీరోయిన్ గా నటిస్తుంది. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ కబాలి ఎన్ని సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close