మంత్రిని కొట్టిన మొనగాడు.. కూడా వలస బాటే!

5వ తేదీ అని ముహూర్తంగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు ఏ లగ్నంలో ప్రకటించారో గానీ… రిజల్టు బాగానే ఉంటున్నట్లుంది. ఒకవైపు జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఒక అంచున ఉన్న జిల్లాల్లోని ఎమ్మెల్యేలను బుజ్జగించి.. వారిని పార్టీలో కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే.. మరోవైపు రాష్ట్రం మరో చివరిలోని శ్రీకాకుళ: జిల్లానుంచి ఒక ఎమ్మెల్యే జారుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే వైకాపాకు చెందిన కలమట వెంకటరమణ తెలుగుదేశంలో చేరడానికి నిర్ణయించుకున్నారు. తన నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవడానికి ఆయన శుక్రవారం ఓ సమావేశం ఏర్పాటుచేశారు. ఆయన మార్చి నాలుగో తేదీలోగా.. తెలుగుదేశం పార్టీలో చేరిపోవచ్చునని వార్తలు వస్తున్నాయి.

కలమట వెంకటరమణ ప్రాథమికంగా తెలుగుదేశానికే చెందిన నాయకుడు. ఆయన తండ్రి తరం నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆయన తండ్రి పాతపట్నంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీనుంచి తెలుగుదేశంలో చేరిన అప్పటి మంత్రి శత్రుచర్ల విజయరామరాజు పాతపట్నం బరిలోకి దిగడంతో.. వెంకటరమణ తెలుగుదేశాన్ని వీడి.. వైకాపాలో చేరారు. అయితే.. ఇప్పుడు ఆయన తిరిగి తెదేపాలో చేరాలని తీసుకున్న నిర్ణయం.. తిరిగి సొంత ఇంటికి రావడం వంటిదే అని పలువురు భావిస్తున్నారు.

పార్టీని వీడిపోకుండా మిగిలిన 62 మందికి జగన్‌ ఒకవైపు హ్యాట్సాఫ్‌ చెప్పి వారిని ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించినట్లు కనిపించడం లేదు. ఇవాళ శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ఎమ్మెల్యే ఫిరాయింపునకు సంబంధించిన వార్త ఖరారు అయింది. త్వరలోనే మరికొన్ని వలసలు కూడా తప్ప ఉంటాయని రాజకీయాల్లో చర్చలు సాగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసేనదే ఆలస్యం – ఆ సీట్లకు అభ్యర్థులెవరు ?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ – జనసేన పార్టీ – భారతీయ జనతా పార్టీ కూటమి దాదాపుగా అన్ని అభ్యర్థులను ప్రకటించాయి. జనసేన తరపున ప్రకటించాల్సిన మూడు అసెంబ్లీ స్థానాలు, ఒక...

చేరికలు కాంగ్రెస్‌కు ప్లస్ కాదు – సవాల్ కూడా !

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ కమ్ సీఎంగా డబుల్ రోల్ పోషిస్తున్న రేవంత్ రెడ్డి పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ స్థీరీకరణ అనే కాన్సెప్ట్ ను ఏకకాలంలో అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా...

బ‌న్నీ బ‌ర్త్డే గిఫ్ట్ అదేనా?!

ఏప్రిల్ 7న‌.. అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా బ‌న్నీ కొత్త సినిమా విశేషాలు బ‌య‌ట‌కు రాబోతున్నాయ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం 'పుష్ష 2' సెట్లో బిజీగా ఉన్నాడు బ‌న్నీ. ఆ సినిమాకు...

‘స్పిరిట్’ రేసులో ముగ్గురు హీరోయిన్లు

'యానిమ‌ల్‌'తో సూప‌ర్ డూప‌ర్ హిట్టు కొట్టాడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో సందీప్ పేరు మ‌రోసారి బాలీవుడ్ లో మార్మోగిపోయింది. ఈ హిట్ తో.. 'స్పిరిట్‌'పై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగిపోయాయి. ప్ర‌భాస్‌ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close