మంచు విష్ణు కన్నప్ప ట్రైలర్ జూన్ 13న విడుదల కానుంది. ఇది విష్ణు కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా. సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు విష్ణు. చాలా మంది ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. అయితే అందరి దృష్టి మాత్రం ప్రభాస్ పై ఉంది. ఈ సినిమాకి బజ్ ప్రభాస్ లుక్ తోనే వచ్చింది. ట్రైలర్లో ప్రభాస్ ఎంట్రీ సీన్లు, ఎలివేషన్ షాట్లు అద్భుతంగా వచ్చాయని ఇన్ సైడ్ టాక్.
టీజర్ లో ప్రభాస్ స్క్రీన్ టైం తక్కువే చూపించారు. ట్రైలర్ లో మాత్రం చాలా షాట్లు ప్రభాస్ పైనే ఉంటాయని సమాచారం. ట్రైలర్‌కు వచ్చే బజ్ సినిమా బిజినెస్‌కు ఉపయోగపడుతుంది. ప్రభాస్ క్రేజ్ తో పాటు భక్తి, వీరత్వం, చరిత్ర కలసిన కథతో కన్నప్పని తెరకెక్కించారు.
కన్నప్పతో ప్రభాస్ కి పర్శనల్ బాండింగ్ వుంది. రెబల్ స్టార్ కృష్ణం రాజు నటించిన భక్త కన్నప్ప మరపురాని సినిమా. ఆ సినిమాని మళ్ళీ ప్రభాస్ తో తీయాలని కృష్ణం రాజు భావించేవారు. కానీ అది కుదరలేదు. ఇప్పుడు అదే కథానేపధ్యంలో కన్నప్పని తీసుకోస్తున్న విష్ణు, ఇందులో ప్రభాస్ ని భాగం చేయడం సినిమాకి చాలా ప్లస్ అవుతోంది. మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.