ఆర్‌.ఎక్స్ 100 హీరో… ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందా?

ఓ సినిమా సామాన్యుడిని సైతం హీరో చేసేస్తుంది. సెల‌బ్రెటీగా మార్చేస్తుంది. స్టార్ స్టేట‌స్ క‌ట్ట‌బెట్టేస్తుంది. అందులో వ్య‌క్తి గొప్పద‌నం కంటే, సినిమా చేసే మ్యాజిక్కే ఎక్కువ‌. అలాంటి మ్యాజిక్‌కి ఉదాహ‌ర‌ణ‌.. కార్తికేయ‌. ఆర్‌.ఎక్స్ 100తో ఒక్క‌సారి వెలుగులోకి వ‌చ్చేశాడు. ఇప్పుడు త‌న చేతినిండా బోలెడ‌న్ని సినిమాలు. ఆర్‌.ఎక్స్ మామూలు హిట్టు కాదు. ఎవ్వ‌రూ ఊహించిన‌ది. ఇలాంటి హిట్టొస్తే… కిక్ వేరే రేంజులో ఉంటుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాక‌పోతే… కార్తికేయని చూస్తే.. ఆ కాన్ఫిడెన్స్ కాస్త ఓవ‌ర్ అయ్యిందా అనిపిస్తుంది.

కార్తికేయ హిప్పీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్లో కార్తికేయ‌ని చూస్తే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. అత‌ని మాట‌లు వింటే… `ఏంటి ఇంత‌లా మాట్లాడేస్తున్నాడు` అనిపిస్తుంది. మా సినిమా హిట్ట‌వుతుంది. సూప‌ర్ హిట్ అవుతుందని చెప్పుకోవ‌డంలో త‌ప్పు లేదు. అలా చెప్ప‌క‌పోవ‌డం త‌ప్పు. కానీ కార్తికేయ మాత్రం `ఆర్‌.ఎక్స్ లాంటి సినిమా కావాలా? దానికి డ‌బుల్ కావాలా? త్రిపుల్ కావాలా? ప‌ది రెట్ల సినిమా కావాలా.. ఇస్తున్నాను తీసుకోండి` అంటూ కాస్త ఓవ‌ర్ గా మాట్లాడాడు. ఆర్.ఎక్స్ లాంటి సినిమా మ‌రోటి వ‌స్తే కార్తికేయ కూడా స్టార్ అయిపోతాడు. అందులో డౌట్ లేదు. దానికి ప‌ది రెట్ల సినిమా ఇస్తాను తీసుకోండి.. అన్నాడంటే ఆ సినిమాని మ‌నం ఏ రేంజులో ఊహించుకోవాలి? ఒక్క సినిమాతోనే త‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింద‌న్న భ్ర‌మ‌లో ఉన్నాడు కార్తికేయ‌. `మీ వ‌ల్లే నేనిలా ఉన్నాను` అంటూ పెద్ద పెద్ద సూప‌ర్ స్టార్లు అభిమానుల్ని ఉద్దేశించి మాట్లాడ‌తారే… అలా మాట్లాడాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో.

ఈ సినిమా పూర్త‌వ్వ‌గానే మీరు కూడా నాలా ష‌ర్టులు తీసి, గిరి గిర తిప్పండి. ఆ ఫొటోలు మాకు పంపండి… ట్రెండ్ చేద్దాం అని పిలుపు ఇచ్చాడు. ఈ వారం రోజుల్లో సిక్స్ ప్యాక్‌లు పెంచుకోండి.. నాలా టాటూలూ వేసుకోండి అంటూ స‌ల‌హాలు ఇచ్చాడు. పెద్ద పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలే.. ఇలా మాట్లాడ‌రు. అలాంటిది కార్తికేయ ఒక్క సినిమాకి ఇలా రెచ్చిపోతున్నాడేంటి చెప్మా?? అనిపించింది వాళ్లంద‌రికీ. అన్న‌ట్టు మ‌రో సంగ‌తి.. ఈ స్టేజీ ఎక్కిన అతిథులంతా ఎంత‌సేపు మాట్లాడారో కార్తికేయ ఒక్క‌డే అంత‌సేపు మాట్లాడాడు. దాదాపు 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా ప్ర‌సంగించాడు. స్టేజీపై స్టెప్పులు వేశాడు. త‌న చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూసించేశాడు. మొత్తానికి కార్తికేయ ఇప్పుడు మేఘాల్లో ఉన్నాడ‌న్న విష‌యం అర్థ‌మైంది. హిప్పీ సినిమా త‌న‌ని ఆకాశంలోకి తీసుకెళ్తుందో. నేల మీద దించేస్తుందో చూడాలి. సినిమాలు హిట్ట‌వ్వొచ్చు, ఫ్లాప్ అవ్వొచ్చు. కాక‌పోతే… ఇంత ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ మాత్రం అవ‌స‌రం లేదు. ఈ విష‌యాన్ని కార్తికేయ గుర్తు పెట్టుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close