జ‌గ‌న్ చేయ‌బోయే సీఆర్డీయే స‌మీక్ష‌ మీదే అంద‌రి దృష్టి!

సోమ‌వారం నుంచి వ‌రుస‌గా శాఖలవారీ స‌మీక్షా కార్య‌క్ర‌మాలు పెట్టుకున్నారు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. మొద‌టిగా ఆర్థిక శాఖ రివ్యూ ఉంటుంది. అక్క‌డి నుంచి మొద‌లుపెడితే వ్య‌వ‌సాయం, రెవెన్యూ… ఇదే క్ర‌మంలో 6వ తేదీన సీఆర్డీయే రివ్యూ ఉంటుంది. ఆ స‌మీక్ష మీదే ఇప్పుడు అంద‌రి దృష్టీ ఉంది. ఎందుకంటే, న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణ‌మంతా సీఆర్డీయే ప‌రిధిలోనే జ‌రుగుతోంది కాబ‌ట్టి! రాజ‌ధాని నిర్మాణంపై జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వైఖ‌రి ఏలా ఉంటుంద‌నే ఆస‌క్తి కూడా అన్ని వ‌ర్గాల్లోనూ ఉన్న తెలిసిందే. వైకాపా అధికారంలోకి వ‌స్తే రాజ‌ధానిని మార్చేస్తారా అనే చ‌ర్చ కూడా ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో తీవ్రంగా జ‌రిగింది. దీంతో, సీఆర్డీయే రివ్యూలో జ‌గ‌న్ ఎలా స్పందిస్తార‌నేది కొంత ఆస‌క్తిక‌రంగా మారింది. అంతేకాదు… రాజ‌ధాని నిర్మాణ ప‌నుల్లో నిమ‌గ్న‌మైన కొన్ని ప్ర‌ముఖ కంపెనీలు కూడా సీఆర్డీయే రివ్యూపై ఉత్కంఠ‌గానే ఉన్నాయి.

కాంట్రాక్టుల విష‌యంలో తాను ఎలా వ్య‌వ‌హ‌రిస్తానో అనేది తొలిరోజే సీఎం జ‌గ‌న్ స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. రివ‌ర్స్ టెండ‌రింగ్ విధానం తీసుకొచ్చి… ఇప్పుడున్న కాంట్రాక్టుల‌న్నీ మార్చేస్తామ‌ని అన్నారు. దీంతో, ఇప్ప‌టికే రాజ‌ధానితోపాటు ఏపీలో కొన్ని ప‌నులు చేస్తున్న కంపెనీల‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న ప్ర‌భావం ఎంత తీవ్రంగా ఉందంటే… ఆంధ్రాలో దాదాపు రూ. 8 వేల కోట్ల విలువ‌గ‌ల‌ ప‌నులు చేప‌డుతున్న ఎన్.సి.సి. కంపెనీ షేరు విలువ స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులోనే రూ. 20 ప‌డిపోయింది. ఈ కంపెనీకి ద‌క్కిన కాంట్రాక్టులు ర‌ద్ద‌యిపోతాయేమో అనే అనుమానాల‌తో కంపెనీ షేర్ ధ‌ర త‌గ్గిపోయింది. హుటాహుటిన మ‌దుప‌రుల‌కు ఆ కంపెనీ వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం సీఆర్డీయే ప‌రిధిలో ప‌నులు చేస్తున్న కంపెనీల భ‌విష్య‌త్తు ఏంట‌నేది జ‌గ‌న్ నిర్వ‌హించ‌బోయే స‌మీక్ష‌లో తేల‌బోతోంద‌నే చ‌ర్చ జరుగుతోంది. అంతేకాదు, సీఎం రివ్యూ చేయ‌బోతున్నారు కాబ‌ట్టి… ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌నుల్ని కూడా తాత్కాలికంగా నిలిపేయాలంటూ ఆదేశించార‌నీ స‌మాచారం. అమ‌రావ‌తితోపాటు ఇత‌ర ప్రాజెక్టుల ప‌నుల్లో ఇంత‌వ‌ర‌కూ జ‌రిగిన ప్రోగ్రెస్ అంతా సీఎం స‌మీక్షించి, అనంత‌రం ఆయ‌న తీసుకోబోయే నిర్ణ‌యాల ప్ర‌కార‌మే ప‌నులు ముందుకు సాగే ప‌రిస్థితి ఉంటుంద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో, జ‌గ‌న్ నిర్వ‌హించ‌బోయే సీఆర్డీయే స‌మీక్ష చాలా కీల‌కంగా మార‌నుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మౌతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close