మంత్రి పదవి రాలేదని కాంగ్రెస్ పై తిరుగుబాటు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైసీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన వంద కార్లతో విజయవాడకు వెళ్లారు. జగన్ ను కలిసి ఆ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తాను జగన్ సన్నిహితుడు.. రాంకీ సంస్థల కుటుంబసభ్యుడు అయిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో శుభకార్యానికి వెళ్తున్నానని మీడియాకు సమాచారం ఇచ్చారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని.. జగన్ ను కూడా కలవడం లేదని చెప్పుకొచ్చారు.
శుభకార్యం కోసం అయితే.. ఇంట్లో కుటుంబసభ్యులతో వెళ్లి కలిసి…భోజనం చేసి శుభాకాంక్షలు చెప్పి వస్తారు కానీ… ఇలా రాజకీయ ర్యాలీల్లా.. వంద కార్లతో పోవాల్సిన అవసరం ఉండదు. శుభకార్యానికి కుటుంబాన్ని పిలుస్తారు కానీ.. నియోజకవర్గ క్యాడర్ మొత్తాన్ని తీసుకు రావాలని పిలవరు. కోమటిరెడ్డి ఈ లాజిక్ మిస్సయ్యారు. ఆయన ఏ పార్టీలో చేరుతారో తెలియదు కానీ.. తమ పార్టీని మాత్రం బ్లా క్ మెయిల్ చేయడానికి ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని పడగొడతానని సవాల్ చేస్తున్నారు.
నిధులకు లోటు లేని రాజగోపాల్ రెడ్డి.. జగన్ రెడ్డితో కలిసి రేవంత్ ప్రభుత్వంపై కుట్ర చేస్తారనే అనుమానాలు బలంగా ఏర్పడుతున్నాయి. ఇప్పటికే జగన్ తో.. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యాపార బంధాలు ఉన్నాయి. ఇటీవల ఆయన కూడా జగన్ ను కలిశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వారి కంపెనీలకు వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా జగన్ దగ్గరే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి, జగన్ కలిసి రేవంత్ పై కుట్ర చేస్తారా అన్నది మాత్రం తేలాల్సి ఉంది.
