పట్టించుకోకపోయినా ఆవేశపడుతున్న వెంకటరెడ్డి !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఆయనకు మునుగోడు ఉపఎన్నికల్లో ఎలాంటి బాధ్యతలు ఇవ్వకపోవడమే కాకుండా కనీసం .. ఎన్నికల సమావేశాలకూ కూడా పిలవడం లేదు. ప్రచారం చేయమని కూడా అడగడం లేదు. స్టార్ క్యాంపెయినర్ అనే హోదా తీసుకుని ఇప్పుడు ఆయన ఎందుకు కొరగాకుండా పోయాడు. ప్రచారాలకు..ర్యాలీలకు పాదయాత్రలకు పిలవడం లేదు. దీంతో ఆయన మళ్లీ మీడియా ముందుకు వచ్చి.. మునుగోడు గురించి తనకేమీ తెలియదని తాను ప్రచారానికి పోవడం లేదని చెప్పుకొచ్చారు.

తనను బచ్చాగాళ్లతో తిట్టిస్తున్నారని.. తిట్టిన వాళ్లను సస్పెండ్ చేయాలని..తిట్టించిన వారు క్షమాపణ చెప్పాలని అంటున్నారు. జానారెడ్డిని కలిసిన మాణిక్యం ఠాగూర్ తనను కలవలేదని వెంకటరెడ్డి ఫీలవుతున్నారు. కానీ ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి మైనస్ చేసుకున్నారని ఇప్పటికీ జరుగుతున్న పరిణామాలు స్పష్టమవుతున్నాయి. తనను గెంటి వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయనంటున్నారు. సోనియా , రాహుల్ వద్దే తేల్చుకుంటానని చెబుతున్నారు.

కానీ ఆయన తీరుతో కాంగ్రెస్ పార్టీలో ఆయనకు ఇక ఎలాంటి పాత్ర ఉండదని స్పష్టమైపోయింది.కనీసం అపాయింట్‌మెంట్ కూడా దొరకదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గెంటివేయడం అంటూ ఉండదని.. ఆయనంతటకు ఆయన వెళ్లి బీజేపీలో చేరితే బెటరని .. కాంగ్రెస్ వర్గాలు కూడా సలహాలిస్తున్నాయి. కానీ చేయాల్సినంత రచ్చ చేసిన తర్వాత.. తమ్ముడిని ఎంత మేలు చేస్తే అంత చేసిన తర్వాతే బయటకు వెళ్లేందుకు కోమటిరెడ్డి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close