కొర‌టాల శివ‌తో ఇంట‌ర్వ్యూ: ఎన్టీఆర్‌తో సినిమా అంటే ముందు భ‌య‌ప‌డ్డా!

మిర్చి..
శ్రీ‌మంతుడు…
తీసింది రెండు సినిమాలే. కానీ త‌న‌కంటూ ఓ ఇమేజ్ సృష్టించుకొన్నాడు కొర‌టాల శివ‌. ఇమేజ్ ఏంటి..?? దాన్ని బ్రాండ్ అనాల్సిందే. రెండు సినిమాల‌తోనే టాప్ ద‌ర్శ‌కుల లిస్టులో స్థానం సంపాదించుకొన్నాడు. ఓ సామాజిక అంశానికి క‌మ‌ర్షియ‌ల్ కోటింగ్ ఇవ్వ‌డంలో కొర‌టాల సిద్ద‌హ‌స్తుడ‌ని అనిపించుకొన్నాడు. ఇప్పుడు జ‌న‌తా గ్యారేజ్‌లో ఏం జ‌రుగుతుందో చూపించ‌బోతున్నాడాయ‌న‌. ఎన్టీఆర్‌లాంటి ఓ మాస్ హీరోని ప్ర‌కృతి ప్రేమికుడిగా చూపించాల‌న్న ఆలోచ‌నే కొత్త‌గా అనిపిస్తోంది. ట్రైల‌ర్‌.. అందులో వినిపిస్తున్న డైలాగులు.. పాట‌లు.. పోస్ట‌ర్లు… ఇవ‌న్నీ ఈ సినిమాపై అంచ‌నాల్ని మ‌రింత‌గా పెంచేస్తున్నాయి. సెప్టెంబ‌రు 1న జ‌న‌తా గ్యారేజ్ విడుదల కాబోతోంది. ఈ సంద‌ర్భంగా కొర‌టాల శివ‌తో చేసిన చిట్ చాట్‌..

* హాయ్‌…
– హాయండీ…

* ఒక‌రోజు ముందే జ‌న‌తా గ్యారేజ్‌ని సిద్ధం చేయాల్సివ‌చ్చింది. టెన్ష‌న్‌ప‌డ్డారా?
– అదేం లేదు. ఎందుకంటే… ఈ సినిమా ఫైన‌ల్ కాపీ ఎప్పుడో రెడీ చేసేశాం. కాబ‌ట్టి అంత టెన్ష‌న్ ఏమీ అనిపించ‌లేదు..

* మిర్చి, శ్రీ‌మంతుడు.. ఇలా వ‌రుస‌గా రెండు హిట్లు కొట్టారు. హ్యాట్ర‌క్‌పై గురి పెట్టారా?
– మిర్చి బాగా ఆడాక‌.. దానికంటే మంచి క‌థ రాయాలి అనే ఉద్దేశంతో శ్రీ‌మంతుడు రాశా. ఆ త‌ర‌వాత శ్రీ‌మంతుడు కంటే మంచి క‌థ రాయాలి.. అనిపించి జ‌న‌తా గ్యారేజ్ రాశా. నా దృష్టంతా మంచి క‌థ రాయడంపైనే ఉంటుంది. దాన్ని హిట్ అంటారా, సూప‌ర్ హిట్ అంటారా, లేదంటే.. హ్యాట్రిక్ అంటారా అనేది ఆడియ‌న్స్ చెప్పాలి.

* కానీ హీరోల‌కు వ‌సూళ్ల లెక్క‌లు కావాలి క‌దా?
– హీరోల‌కు అవ‌స‌రం లేదండీ. నిజానికి వాళ్లేం ప‌ట్టించుకోరు. మీడియా, ఫ్యాన్స్ వ‌ల్లే.. ప‌ట్టించుకోవాల్సివ‌స్తోంది. వాళ్ల‌కు మంచి క‌థ చేయాల‌ని ఉంటుంది.. మాకు మంచి సినిమా తీయాల‌ని ఉంటుంది.

* అస‌లు జ‌న‌తా గ్యారేజ్ టైటిల్ పెట్ట‌డానికి రీజ‌న్ ఏంటి?
– ఇప్పుడు కాదు గానీ.. ఎయిటీస్‌లో జ‌న‌తా అనే పేరు చాలా పాపుల‌ర్‌. జ‌న‌తా ఖాదీ, జ‌న‌తా టైల‌ర్‌.. ఇలాంటి పేర్లు ఎక్కువ‌గా క‌నిపించేది. జ‌నతా థియేట‌ర్ కూడా ఎక్క‌డో చూశా. జ‌న‌తా.. అంటే జ‌నం. జ‌నం గురించి మాట్లాడుకొనేట‌ప్పుడు ఆ మాట వాడ‌తాం. నాదీ జ‌నానిని సంబంధించిన క‌థే. అందుకే ఆ పేరు పెట్టాం. క‌థ రాస్తున్న‌ప్పుడే ఫిక్స్ చేసిన టైటిల్ అది.

* ఎన్టీఆర్ కోస‌మే రాసుకొన్న క‌థ అనుకోవ‌చ్చా?
– త‌ప్ప‌కుండా. ఎందుకంటే ర‌భ‌స టైమ్‌లో ఆయ‌న‌కు ఈ క‌థ వినిపించా. అప్పుడు కుద‌ర్లేదు. మోహ‌న్ లాల్ పాత్ర కూడా అప్పుడు అనుకొన్న‌దే.

* ఎన్టీఆర్‌తో ప్ర‌యాణం ఎలా అనిపించింది?
– బృందావ‌నం నుంచీ ఆయ‌న నాకు బాగా తెలుసు. అన్న‌య్యా.. అన్న‌య్యా అని పిలుచుకొంటాం. అంత రాపో ఉన్న‌ప్పుడు.. ప‌నిచేయ‌గ‌ల‌నా అనిపించింది. ఎందుకంటే కొన్ని కొన్ని సార్లు సినిమా రిజ‌ల్ట్ వ‌ల్ల వ్య‌క్తిగ‌త సంబంధాలు దెబ్బ‌తింటాయి. అందుకే ఎన్టీఆర్ సినిమా అనేస‌రికి కొంత భ‌య‌ప‌డ్డా. కానీ ఎన్టీఆర్‌తో నా ట్రావెలింగ్ అద్భుతంగా జ‌రిగింది. ఒక‌రికొక‌రు బాగా క‌నెక్ట్ అయిపోయాం.

* ఎన్టీఆర్‌ని ఈ సినిమాలో ఎంత కొత్త‌గా చూపిస్తున్నారు?
– ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ఉన్న ఓ స్టార్. అత‌న్నుంచి ఎక్కువ‌గా లౌడ్ పెర్‌ఫార్మ్సెన్స్ చూశాం. ఈ సినిమాలో మాత్రం చాలా సెటిల్డ్‌గా చేశారు. కొన్ని కొన్ని సార్లు ఎమోష‌న్స్ పండాలంటే ఆ లౌడ్ నెస్ ఉండాలి. కానీ.. అది లేకుండా కూడా అంతే బాగా ఎమోష‌న్ పండించారు.

* మిర్చిలో ప్ర‌భాస్‌, శ్రీ‌మంతుడులో మ‌హేష్ బాబు స్టైలీష్‌గా.. కొత్త‌గా క‌నిపించారు. కానీ ఈ సినిమాకొస్తే లుక్ ప‌రంగా ఎన్టీఆర్‌లో పెద్ద తేడా లేదు.. ఎందుక‌లా?
– నా సినిమాలో క‌థానాయ‌కుడు ప్ర‌కృతి ప్రేమికుడు. ఆకాశాన్ని, మొక్క‌నీ చూస్తున్న‌ప్పుడు ఎంత స‌హ‌జంగా క‌నిపిస్తాయో.. తన‌నీ అంతే స‌హ‌జంగా చూపించాల‌నుకొన్నా.

* డ‌బ్బింగ్ విష‌యంలో మోహ‌న్‌లాల్‌కీ మీకూ ఏదో క్లాష్ వ‌చ్చిన‌ట్టు వార్త‌లొచ్చాయి..
– అలాంటిదేం లేదండీ. ఆయ‌న పాత్ర‌కు మ‌రొక‌రితో డ‌బ్బింగ్ చెప్పించాల‌న్న‌ది పూర్తిగా ఆయ‌న నిర్ణ‌య‌మే. ఆయ‌న వాయిస్ ముద్ద ముద్ద‌గా ఉంటుంది. సింక్ అవ్వ‌డం లేదు. ఎంత‌కాద‌న్నా… ఆయ‌న‌కు తెలుగు స్ప‌ష్టంగా రాదు. బ‌ల‌వంతంగా మాట్లాడిన‌ట్టే ఉంటుంది. థియేట‌ర్లో ఆడియ‌న్స్ ఇబ్బంది ప‌డ‌తార‌న్న ఉద్దేశంతోనే మ‌రొక‌రితో డ‌బ్బింగ్ చెప్పించాం.

* ర‌చ‌యిత నుంచి ద‌ర్శ‌కుడిగా మారారు.. మీలో ఏం మార్పు క‌నిపిస్తోంది?
– పెద్ద‌గా మార్పులేం లేవండీ. ద‌ర్శ‌క‌త్వం అనేది పెద్ద బాధ్య‌త‌. అన్ని ప‌నులూ చూసుకోవాలి క‌దా. ప‌నులు ఎక్కువ‌య్యాయి అంతే.

* మిర్చి 2 ఉంటుందా?
– ప్ర‌భాస్‌తో సినిమా ఉంటుంది. అది ఎప్పుడ‌న్న‌ది చెప్ప‌లేను. ఓ మంచి క‌థ రాసుకొన్న‌ప్పుడు అది ప్ర‌భాస్‌కి త‌ప్ప ఇంకెవ్వ‌రికీ సూట్ అవ్వ‌దు అనుకొంటే త‌ప్ప‌కుండా ఆయ‌న‌కే వినిపిస్తా.

* రామ్‌చ‌ర‌ణ్‌తో సినిమా ఉంటుందా, ఉండ‌దా?
– ప్ర‌తీ హీరోతోనూ ప‌నిచేయ‌యాల‌నే ఉంటుంది. కానీ ఎప్పుడ‌న్న‌ది మ‌న చేతుల్లో ఉండ‌దు.

* రీమేక్స్‌, సీక్వెల్‌ల‌పై మీ అభిప్రాయం..
– నాకెప్పుడూ కొత్త క‌థ చెప్పాల‌ని ఉంటుంది. పాత క‌థే మ‌ళ్లీ చెప్ప‌డం బోర్‌.

* త‌దుప‌రి సినిమా…
– మ‌హేష్‌బాబుతోనే. శ్రీ‌మంతుడుకీ దానికీ ఎలాంటి సంబంధం ఉండ‌దు. పూర్తిగా కొత్త క‌థ‌.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
– థ్యాంక్యూ…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close