చంద్రబాబు అమరావతికి పైసా తెచ్చుకోలేని అసమర్థుడు-కేటీఆర్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ రాజధాని అమరావతి నిర్మాణానికే కేంద్రంనుంచి నిధులు తెచ్చుకోలేకపోయారని, ఆయన కుమారుడు లోకేష్ హైదరాబాద్‌కు ఏమి నిధులు తీసుకొస్తాడని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్ ఫీనిక్స్ క్లబ్‌లో ఐటీ ఉద్యోగిసంఘాల ప్రతినిధులతో ఆయన ఇవాళ సమావేశమయ్యారు. లోకేష్ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తానని అంటున్నాడని, అయితే చంద్రబాబే అమరావతికి కేంద్రంనుంచి పైసా తెచ్చుకోలేని అసమర్థుడని అన్నారు. చంద్రబాబు వల్ల మాత్రమే ఐటీ కంపెనీలు రాలేదని, హైదరాబాద్‌లో ఉన్న మంచి పరిస్థితులవల్లే వచ్చాయని చెప్పారు. ఇది స్టేట్ ఫైట్ కాదు, స్ట్రీట్ ఫైట్ అన్నారు. టీడీపీ-బీజేపీ హైదరాబాద్‌కు చేసిందేమీ లేదని అన్నారు. హైదరాబాద్‌ను తానే కట్టానని చంద్రబాబు అంటున్నారని, అది మంచిది కాదని చెప్పారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఇంటర్నెట్ కనిపెట్టింది కూడా తానేనని చెబుతారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఐఫా ఉత్సవం వెనక తెలంగాణ ప్రభుత్వ కృషి ఉందని అన్నారు. హైదరాబాద్ యానిమేషన్, మల్టీమీడియా, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మారబోతోందని చెప్పారు. అమెరికాన్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపే చూస్తున్నాయని, సిలికాన్ వ్యాలీలో కూడా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నారని అన్నారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, విద్యావంతులు ఓటింగ్‌కు దూరంగా ఉండటం మంచిది కాదని చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close