మారుతి అతి జాగ్ర‌త్త‌

మారుతి స్వ‌త‌హాగా మంచి ర‌చ‌యిత‌. త‌న సినిమా క‌థ‌ల‌న్నీ త‌న‌వే. స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లూ త‌న‌వే. ఒక్క‌డే కూర్చుని రాసుకోవ‌డం అంటే మారుతికి ఇష్టం. ప‌దిమంది రైట‌ర్ల‌ని పెట్టుకుని డిస్క‌ర్ష‌న్లు చేయ‌డం, డైలాగుల‌కు వెర్ష‌న్లు రాయించ‌డం త‌న‌కు ఇష్టం ఉండ‌దు. త‌న సినిమాలో వినిపించే ప్ర‌తీ డైలాగూ అచ్చంగా త‌న సొంతం. ఈ విషయంలో మారుతి త్రివిక్ర‌మ్ నే ఫాలో అయిపోతాడు. ఎందుకంటే.. త్రివిక్ర‌మ్ కూడా అంతే. క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగుల విష‌యంలో ఎవ‌రి సాయం తీసుకోడు. ఎంత పెద్ద ర‌చ‌యిత అయినా.. న‌లుగురైదుగురు అసిస్టెంట‌ర్ల‌ని పెట్టుకుంటారు. కానీ మారుతి, త్రివిక్ర‌మ్ మాత్ర‌మే ఈ ప‌ద్ధ‌తికి దూరం.

అయితే ప్ర‌భాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు మారుతి. ఈ సినిమా కోసం తొలిసారి రైట‌ర్ల టీమ్ ని పెట్టుకున్నాడు మారుతి. క‌థ త‌న‌దే అయినా సీన్ల విష‌యంలో ఇంకొంద‌రి స‌హాయం తీసుకుంటున్నాడు. వాసు వ‌ర్మ ఈ టీమ్ లో ఓ స‌భ్యుడు. వీళ్ల‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ముగ్గురు రైట‌ర్లు ఉన్నార్ట‌. ఇలా… క‌థ వండ‌డంలో మ‌రొక‌రి స‌హాయం తీసుకోవ‌డం మారుతి కెరీల్ లో ఇదే తొలిసారి. కానీ త‌ప్ప‌దు. ఎందుకంటే ఇది ప్ర‌భాస్ సినిమా. ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌. అంత‌టి స్టార్ ఇప్పుడు మారుతికి అవ‌కాశం ఇవ్వ‌డ‌మే గొప్ప‌. దాన్ని నిల‌బెట్టుకోవాలంటే.. ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిందే. లేదంటే ప్ర‌భాస్ ఛాన్స్ ఇచ్చినా, మారుతి స‌ద్వినియోగం చేసుకోలేద‌న్న నింద మోయాల్సివ‌స్తుంది. దానికంటే.. ఇలా న‌లుగుర్ని సాయం కోర‌డంలో త‌ప్పేం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close