జ‌గ‌న్ తీరే అంత‌… ద‌గ్గ‌ర్నుంచీ చూశాన‌న్న మంత్రి!

ప్ర‌తిప‌క్ష జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై విశాఖ‌లో జ‌రిగిన క‌త్తి దాడి ఒక క్రియేష‌న్ అని అభివ‌ర్ణించారు ఏపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి. అమ‌రావ‌తిలో ఒక ప్రెస్ మీట్ లో మంత్రి మాట్లాడుతూ… జ‌గ‌న్ కి త‌గిలిన గాయం కందిరీగ కుట్టిన దానికంటే త‌క్కువ అన్నారు. త‌మ అంచ‌నా ప్ర‌కారం జ‌గ‌న్ కి గాయాన్ని కుట్లు అనేవి క్రియేష‌న్ వ‌న్ అనీ, ఆసుప‌త్రిలో హ‌డావుడి చేయ‌డం క్రియేష‌న్ టు అనీ, ఇప్పుడా గాయానికో క‌ట్టు అనేది క్రియేష‌న్ త్రీ అంటూ మంత్రి ఆది నారాయ‌ణ విమ‌ర్శించారు. చేతికి బ‌ల‌మైన గాయం త‌గిలితే ఎవ‌రైనా వెంట‌నే ఆసుప‌త్రికి పోతార‌నీ, వైజాగ్ లో మంచి ఆసుప‌త్రులు చాలా ఉన్నా కూడా జ‌గ‌న్ ఎక్క‌డికీ పోకుండా, న‌వ్వుతూ హైద‌రాబాద్ వ‌చ్చేశార‌న్నారు. ఇదంతా సినిమా క్రియేష‌న్ అని ఎద్దేవా చేశారు.

ఈ గాయాన్ని ఒక సినిమాగా న‌డిపించాడ‌నీ, జ‌గ‌న్ తో తాను ప‌క్క‌నే కొన్నాళ్లుగా ఉంటూ వ‌చ్చాను కాబ‌ట్టి, జ‌గ‌న్ తీరేంటో త‌న‌కు ప్ర‌త్య‌క్షంగా తెలుసునీ, వ్య‌క్తిగ‌తంగా చాలాసార్లు చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌ని ఆది నారాయ‌ణ రెడ్డి వ్యాఖ్యానించారు. తాను ద‌గ్గ‌రుండి చాలాసార్లు జ‌గ‌న్ కు న‌చ్చ‌జెప్పాన‌నీ, ‘వ‌ద్దు సామీ ఇలాంటి త‌ప్పులు చెయ్యొద్ద‌ని చాలా సంద‌ర్భాల్లో చెప్పా’న‌న్నారు. దాంతో అక్క‌డి నుంచి త‌న‌ను దూరం పెట్ట‌డం మొద‌లుపెట్టార‌నీ, అందుకే ఆ త‌రువాత టీడీపీలోకి వ‌చ్చాన‌ని ఆది నారాయ‌ణ రెడ్డి చెప్పారు.

జ‌గ‌న్ పై క‌త్తి దాడి అంశ‌మై లోతైన ద‌ర్యాప్తు జ‌రుగుతోంద‌న్నారు. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కాబ‌ట్టి, జ‌రిగింది ఎంత చిన్న‌టి పొర‌పాటు అయినా దానిపై వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కూ తెలియాల్సి ఉంటుంద‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై తామేదో వ్యాఖ్య‌లు చేసినంత మాత్రాన స‌రిపోదు క‌దా అనీ, దానిపై ఆధారాల‌తో చూపించాల్సిన బాధ్య‌త త‌మ‌కు ఉంటుంద‌న్నారు. ఈ వ్య‌వ‌హారంలో ఎక్క‌డ ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా కోర్టు ఉంద‌నీ, కాబ‌ట్టి వాస్త‌వాల‌న్నీ బ‌య‌ట‌కి వ‌స్తాయ‌నీ, దీన్ని ప్రాణానికి సంబంధించిన వ్య‌వ‌హారంగా చూస్తున్నామ‌న్నారు. దాడికి పాల్ప‌డ్డ నిందితుడు ఇప్పుడో ఇల్లు నిర్మించుకుంటున్నాడ‌నీ, అత‌డికి అంత ఆర్థిక స్థోమ‌త ఎక్క‌డ్నుంచీ వ‌చ్చిందీ, ఆయ‌న వాడిన సిమ్ కార్డుల నుంచి ఎవ‌రెవ‌రికి ఎప్పుడెప్పుడు ఎక్క‌డికి ఫోన్లు పోయాయి అనేది కూడా అన్నీ స్ప‌ష్టంగా బ‌య‌ట‌కి రావాల్సి ఉంద‌న్నారు మంత్రి.

జ‌గ‌న్ ఎవ‌రి మాటా విన‌రు, పార్టీలో ఇత‌రుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోరు, త‌న నిర్ణ‌యానికే అంద‌రూ క‌ట్టుబ‌డి ఉండాల‌నే ధోర‌ణిలో ఉంటార‌నేది గ‌తంలో కూడా చాలాసార్లు ఇలా చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశ‌మే. ఇప్పుడు మంత్రి ఆది నారాయ‌ణ అదే త‌ర‌హా అనుభవాన్ని మ‌రోసారి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

ఐటెమ్ గాళ్‌…. పెద్ద స‌మ‌స్యే!

ఇది వ‌ర‌కు ఏ సినిమాలో ఏ హీరోయిన్‌ని తీసుకోవాలా? అని ద‌ర్శ‌క నిర్మాత‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డేవారు. అనుకొన్నంత స్థాయిలో, సంఖ్య‌లో హీరోయిన్లు లేక‌పోవ‌డం, స్టార్ హీరోల క్రేజ్‌కు స‌రిప‌డా క‌థానాయిక‌లు దొర‌క్క‌పోవ‌డంతో...

ఇదేం స్ట్రాటజీ ఐ ప్యాక్ – గ్రాఫ్ పెరుగుతోందంటే ఆల్రెడీ తగ్గిపోయిందనే కదా అర్థం !

జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరుగుతోందని ప్రచారం చేయాలి . మీకు ఎంత కావాలి ?. ఇది ఐ ప్యాక్ నుంచి వివిధ మీడియా సంస్థలకు.. సోషల్ మీడియా ఖాతాలకు .....

HOT NEWS

css.php
[X] Close
[X] Close