మోదీ మాట : పెట్రో ధరల పాపం గత ప్రభుత్వాలది..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధికారం చేపట్టి ఏడేళ్లు అవుతోంది. ఆయన కశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపించానని చెబుతూంటారు. దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లామని బీజేపీ నేతలు ప్రచారం చేస్తూంటారు. కానీ ఇప్పటికీ.. కొన్ని కొన్ని అంశాల్లో గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెరుగుతున్న పెట్రో ధరల పాపం గత ప్రభుత్వాలదేనని… ప్రధాని మోడీ తేల్చేశారు. గత ప్రభుత్వాలు దిగుమతులు తగ్గించడం దిశగా ఎలాంటి ప్రణాళికలు అమలు చేయలేదని.. అందుకే… తాము దిగుమతులు చేసుకుని రేట్లు పెంచక తప్పడం లేదని ఆయన వాదన.

ప్రస్తుతం పెట్రో ధరలు రోజూ పెంచుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్నాయి కాబట్టే పెంచుతున్నామని కేంద్రం చెబుతోంది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినప్పుడు… తగ్గించలేదు. దాన్ని మాత్రం ఎప్పుడూ ప్రస్తావించారు. అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ధరలు పెరగకపోయినప్పటికీ… ఇండియాలో రేట్లు మాత్రం పెరుగుతూ ఉంటాయని… ఈ అంశంపై అవగాహన ఉన్న వారు చెబుతూ ఉంటారు. ఈ విషయంపై అవగాహన ఉన్న వారెవరికైనా… పెట్రో ధరల పెంపునకు.. అంతర్జాతీయ ధరలు కారణం కాదని స్పష్టంగా తెలుసు. ఒక్క లీటర్ పెట్రోల్ రూ. వంద రూపాయలకు అమ్ముతూంటే.. అందులో రూ.70 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే.

కాంగ్రెస్ హయాంలో ఉన్న ఎక్సైజ్ పన్ను కంటే.. నాలుగింతలు ఎక్కువగా మోడీ ప్రభుత్వం పెంచింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయినప్పుడు కూడా.. ఇండియాలో పెట్రో రేట్లు తగ్గించలేదు. కానీ… కనిష్ట స్థాయి నుంచి కొద్దిగా రేటు పెరిగినా… రేట్లు పెంచడం ప్రారంభించారు. ఎక్సైజ్ ట్యాక్స్‌ను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతూ.. కవర్ చేసుకున్నారు. రేట్లు పెరిగినప్పుడు మాత్రం ప్రజలపై బాదేశారు. పెట్రో రేట్ల పెంపు వల్ల… కేంద్రానికి మూడు లక్షల కోట్లకుపైగా ఆదాయం వస్తోంది. కానీ దీని వల్ల… ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయినా కేంద్రం కానీ ప్రధాని మోడీ కానీ .. తమ ఆదాయంపైనే దృష్టి పెట్టారు. గత ప్రభుత్వాలపై తప్పు తోసేసి.. తాము రాజకీయం చేసుకుంటున్నారు. మధ్యలో ప్రజలు మాత్రం…. నలిగిపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close