టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డేట్ చేస్తుందనే వార్తలు నేషనల్ మీడియా హాట్ హాట్ గా నడిచాయి. అయితే ఇవన్నీ రూమర్స్ ని కొట్టిపారేసింది మృణాల్. ‘ఇలాంటి రూమర్స్ చూసి నవ్వుకుంటాను. ఇవన్నీ ఫ్రీ పీ.ఆర్ స్టంట్స్’ అంటూ ఫైర్ అయ్యింది మృణాల్.
మృణాల్ ఠాకూర్ పై ఇలాంటి రూమర్స్ రావడం కొత్తకాదు. ధనుష్ తో ఆమె రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ వార్తలపై గతంలోనే క్లారిటీ ఇచ్చింది. ధనుష్ తనకు మంచి స్నేహితుడంటూ చెప్పుకొచ్చింది. అంతకుముందు ఓ నటుడితో మృణాల్ పెళ్లి సిద్ధం అవుతున్నారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ గాసిప్పులుగానే మిగిలాయి.
తెలుగులో సీతారామం సినిమాతో మృణాల్ కి స్టార్ డమ్ వచ్చింది. ఆ తర్వాత హాయ్ నాన్న చేసింది. ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా సినిమాలు ఒప్పుకున్నది లేదు. కల్కి లో చిన్న గెస్ట్ రోల్ చేసింది. ఇప్పుడు అడివి శేష్ తో చేస్తున్న డెకాయిట్ ఆమె చేతిలో వున్న తెలుగు సినిమా. బన్నీ అట్లీ సినిమాలో తనే హీరోయిన్ అంటున్నారు కానీ ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.