నాకు అలాంటి భ‌యాల్లేవ్ : నాగ‌శౌర్య‌

ఒక మ‌న‌సు ఇంకొన్ని గంట‌ల్లో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతోంది. ఒక మ‌న‌సు అన‌గానే టాపిక్ నిహారిక వైపు మ‌ళ్లుతోంది. నిహారిక ఎలా చేసింది, టాప్ హీరోయిన్ల‌కు పోటీ ఇస్తుందా? న‌ట‌న‌లో ఎన్ని మార్కులు ప‌డ‌తాయి? అనే విష‌యాల‌పైనే చ‌ర్చించుకొంటున్నారు. ఈ సినిమాకి ఓపెనింగ్స్ ఎన్నొచ్చినా అది నిహారిక చ‌ల‌వే అన్న‌ట్టు మాట్లాడుకొంటున్నారు. త‌న గురించి ఎవ్వ‌రూ మాట్లాడుకోవ‌డం లేద‌ని నాగ‌శౌర్య అలిగాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్‌లో గుస‌గుస‌లు వినిపించాయి. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల గురించి కూడా శౌర్య ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ట్టు మాట్లాడారు. వీటిపై నాగ‌శౌర్య స్పందించాడు.

”నాకు ఎలాంటి అభ‌ద్ర‌తా భావం లేదు. నా గురించి మాట్లాడుకొంటున్నారా, లేదా అనే విష‌యాన్ని నేను ప‌ట్టించుకోను. ఓ సినిమాలో న‌టించిన హీరోయిన్ గురించి మాట్లాడుకొంటే త‌ప్పేంటి? దానివ‌ల్ల కూడా సినిమాకి మంచే జ‌రుగుతుంది క‌దా? పైగా నిహారిక చిరంజీవి గారి ఇంటి నుంచి వ‌చ్చిన అమ్మాయి. త‌న‌పై ఆ మాత్రం ఫోక‌స్ ఉండ‌డంలో త‌ప్పులేదు” అంటూ క్లారిటీ ఇచ్చాడు శౌర్య‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close