నారాలోకేశ్ చీఫ్ జాబ్ క్రియేటర్ గా తన పని సమర్థంగా చేసేందుకు ఎప్పటికప్పుడు అప్ డే అవుతున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే కాకుండా, అవి క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలవుతున్నాయి ,వాటి ద్వారా ఎన్ని ఉద్యోగాలు లభిస్తున్నాయనే అంశంపై నారా లోకేష్ అత్యంత పారదర్శకమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. కేవలం ఒప్పంద పత్రాల కే పరిమితం కాకుండా, ప్రతి పెట్టుబడి గ్రౌండింగ్ అయ్యేలా చూసేందుకు ఆయన ఒక ప్రత్యేకమైన ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏ కంపెనీ ఎప్పుడు వస్తుంది? ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తుంది? అనే వివరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ విధానం వల్ల పరిశ్రమల స్థాపనలో జాప్యం తగ్గడమే కాకుండా, యువతకు భరోసా లభిస్తోంది.
ఉద్యోగ విప్లవం సృష్టించాలన్న లక్ష్యం
లోకేష్ కేవలం విదేశీ పెట్టుబడులకే పరిమితం కాకుండా, ప్రభుత్వ రంగంలో కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చారు. ప్రతి ఏటా ఉగాది పర్వదినాన ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తామన్న తన హామీని నిలబెట్టుకుంటూ, ఇటీవల 10,060 పైగా ప్రభుత్వ పోస్టులతో కూడిన మెగా జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు. నోటిఫికేషన్ తేదీ నుండి నియామక ప్రక్రియ వరకు ప్రతి దశను డిజిటల్ పద్ధతిలో ట్రాక్ చేసేలా వ్యవస్థను రూపొందించడం ఆయన పనితీరుకు నిదర్శనం. దీనివల్ల నిరుద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితి తొలగి, పక్కా ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమయ్యే అవకాశం కలిగింది.
యువత స్కిల్స్ పెంచేందుకు ఏర్పాట్లు
మంత్రి లోకేష్ ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇందుకోసం నైపుణ్యం పోర్టల్ వంటి అత్యాధునిక ఏఐ ఆధారిత వేదికలను అందుబాటులోకి తెచ్చారు. ఏ పరిశ్రమకు ఎటువంటి నైపుణ్యం గల యువత అవసరమో ముందుగానే గుర్తించి, వారికి తగిన శిక్షణ ఇచ్చి నేరుగా ఉద్యోగాల్లో చేర్పించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయంటే అది లోకేష్ అనుసరిస్తున్న ఈ వ్యాపార అనుకూల , ఫలితాల ఆధారిత విధానమే కారణం.
ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం
ఒక నాయకుడికి విజన్ ఉండటమే కాదు, దాన్ని అమలు చేసే పట్టుదల కూడా ఉండాలని లోకేష్ నిరూపిస్తున్నారు. పెట్టుబడుల రాకను, ఉద్యోగాల సృష్టిని ట్రాక్ చేయడం ద్వారా అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచారు. రాజకీయం అంటే కేవలం ఉపన్యాసాలు కాదు, అది యువత భవిష్యత్తును నిర్మించే ఒక ప్రణాళిక అని ఆయన చాటిచెబుతున్నారు. తన యువగళం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటూ, రాష్ట్రాన్ని జాబ్ హబ్ గా మార్చడంలో లోకేష్ చేస్తున్న ఈ ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంటోంది.
