ఫణి ప్రకోపంపై మోడీ సమీక్ష..! కోడ్ అమల్లో ఉంటే ప్రధానికి ప్రత్యేకాధికారాలు వస్తాయా..?

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్… ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మరిన్ని అధికారాలు కట్టబెట్టినట్లుగా ఉంది. ప్రధానమంత్రి హోదాలో.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కూడా… ఆయనే తీసేసుకుని… తుపాను ఫణి పై.. సమీక్షల మీద సమీక్షలు చేస్తున్నారు. మీడియాలో విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఫోటోలు, వీడియోలు విడుదల చేస్తున్నారు. కానీ.. ఆయా రాష్ట్రాల్లో.. కనీసం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో… కూడా కోడ్ సడలించలేదు. నేరుగా.. తుపాను.. ఒడిషాను తాకుతూండటంతో… ఆ ఒక్క రాష్ట్రంలో పదకొండు జిల్లాల్లో కోడ్ సడలింపులు ఇచ్చిన ఈసీ… తుపాను ప్రభావం ఉన్న మరో మూడు రాష్ట్రాలపై శీత కన్నేసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే లేఖలు రాసినా.. కనీసం స్పందన లేదు.

కోడ్ పేరుతో.. అధికారులు ఎవరూ సీఎంల ఆదేశాలు పాటించకూడదని.. తాను నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ద్వారా సందేశాన్ని పంపిన ఈసీ… ప్రధానమంత్రికి మాత్రం ప్రత్యేకాధికారాలు కల్పించింది. రాష్ట్రాల్లో తుపాను సహాయక చర్యలపై.. ఆయన కేబినెట్ సెక్రటరీ సహా.. ఉన్నతాధికారులందర్నీ పిలిపించుకుని సమీక్ష చేసినా కిమ్మనడం లేదు. అదేమీ కోడ్ కు విరుద్ధం కాదంటున్నారు. మరి ఏపీలో మాత్రం..సీఎం తుపాను పై సమీక్ష చేయడానికి అధికారం లేకుండా పోయింది. అయినా చంద్రబాబు…కోడ్ అంగీకరించినంత వరకూ…తన విధులు నిర్వర్తించడానికి..పార్టీ పరంగా ఏర్పాటు చేసుకున్న సమీక్షల్ని కూడా క్యాన్సిల్ చేసుకుని ఉదయమే సచివాలయానికి వెళ్లారు. తుపానును ఎదుర్కోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరాలు తెలుసుకున్నారు.

తుఫాన్ సహాయక చర్యల కోసం కొత్తగా జీవోలు అక్కర్లేదని .. మళ్లీ వాటికోసం ఈసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని…తిత్లీ తుఫాన్ సమయంలో జారీచేసిన ఆదేశాలనే ఇప్పుడు అనుసరించవచ్చని అధికారులకు సూచించారు. అవసరమైతే నేను క్షేత్రస్థాయి పర్యవేక్షణకు వస్తానన్నారు. పసిపిల్లలకు పాలు అందుబాటులో ఉంచడం, టెట్రా పాల ప్యాకెట్లను సరఫరా చేయడం, తుఫాన్‌ ప్రాంతాలకు అవసరమైన మేర పశు దాణా తరలించడం, క్రేన్లు, విద్యుత్‌, టెలిఫోన్‌ సిబ్బందిని ఉంచుకోవాలని సూచనలు చేశారు. మరో వైపు.. నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసిన చంద్రబాబు.. ఎలాంటి సాయం అయినా చేయడానికి సిద్ధమని ఆపన్న హస్తం అందించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close