నెక్ట్స్ నువ్వే ట్రైల‌ర్ : ఇల‌క‌త మ‌ఫిలియానే!!


హార‌ర్‌లో కామెడీ మిక్స్ చేసి… క‌థ వండేయ‌డం ఇప్ప‌టి ద‌ర్శ‌కుల‌కు చాలా ఈజీ అయిపోయింది. కాక‌పోతే ఆ తూకం కుద‌ర‌క సినిమాల‌న్నీ ఫ‌ట్ మంటున్నాయి. అయినా స‌రే.. ఆ ప్ర‌య‌త్నాలు నిరాటంకంగా కొన‌సాగుతూనే ఉన్నాయి. బుల్లి తెర‌పై స్టార్ డ‌మ్ తెచ్చుకొన్న ఈటీవీ ప్ర‌భాక‌ర్ ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా మారి చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం ‘నెక్ట్ నువ్వే’ కూడా ఓ హార‌ర్ కామెడీ సినిమానే. ఆది క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైల‌ర్ ఇప్పుడు విడుద‌లైంది. నాలుగు ప్ర‌ధాన పాత్ర‌ల్ని వెన్నెల కిషోర్ వాయిస్ ఓవ‌ర్‌తో ప‌నిచేయ‌డం చేయ‌డం, ఆయా పాత్ర‌ల‌న్నీ ఫ‌న్నీగా, ఇంట్ర‌స్టింగ్‌గా ఉండ‌డం ‘నెక్ట్స్ నువ్వే’ చూడాల‌న్న ఆస‌క్తిని క‌లిగించాయి. మ‌ధ్య‌లో రేష్మి హాట్ హాట్ మాట‌లు, వ్యాంపుకు త‌గ్గ‌ని పోజులు కుర్ర‌కారుని వేడిక్కించ‌డం ఖాయంలా క‌నిపిస్తున్నాయి. కామెడీ ట‌చ్ వ‌ర‌కూ బాగానే ఉంది. ట్రైల‌ర్‌లో సెకండాఫ్ హార‌ర్ జోన‌ర్‌లోకి తీసుకెళ్లిపోయాడు ద‌ర్శ‌కుడు. ఓ ఇల్లు.. అక్క‌డ వ‌స్తున్న‌వాళ్లంద‌రూ చ‌చ్చిపోవ‌డం, చంద్ర‌ముఖి టైపు ల‌క‌ల‌కల‌క‌లు.. ఇవ‌న్నీ కామ‌న్‌గా క‌నిపించే విష‌యాలు. కాక‌పోతే.. కామెడీ బిట్లు పండేశాయ‌ని అనిపిస్తుండ‌డంతో.. ‘నెక్ట్స్ నువ్వే’పై ఆశ‌లు, అంచ‌నాలు పెంచుకోవొచ్చ‌ని అనిపిస్తోంది. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ నుంచి వ‌స్తున్న సినిమా ఇది. కాబ‌ట్టి… టెక్నిక‌ల్ వాల్యూస్‌, మేకింగ్ ప‌రంగా క్వాలిటీ చూడొచ్చు. ఆదికి చాలా కాలం నుంచి హిట్టు లేదు. కాస్త టైమ్ కూడా క‌లిసొస్తే.. ఈ సినిమా హిట్ట‌య్యే ఛాన్సులున్నాయి మ‌ని.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.