ఈ ‘మజ్ను’ కి ఏమయ్యింది ?

నానిని ఇప్పుడు బుల్లి హీరోలా చూడ‌కూడ‌దు. అప్ క‌మింగ్‌ స్టార్ హీరో కేట‌రిగిలో నాని ఎప్పుడో చేరిపోయాడు. అత‌ని సినిమాకి రూ.30 కోట్లు కొల్లగొట్టగ‌ల స్టామినా ఉంద‌ని ఇది వ‌ర‌కే నిరూపిత‌మైంది. ఓవ‌ర్సీస్ లో నానికి తిరుగులేకుండా పోతోంది. మిలియ‌న్ డాల‌ర్ల క్లబ్ లో నాని సినిమాలు ఈజీగా చేరిపోతున్నాయి. వ‌రుస విజ‌యాల‌తో త‌న ఇమేజ్‌, మార్కెట్ రోజు రోజుకీ పెంచుకొంటున్నాడు. త‌న తాజా చిత్రం మ‌జ్ను ఈ వార‌మే ప్రేక్షకుల ముందుకు వ‌స్తోంది. అయితే.. మ‌జ్నుకి సంబంధించిన ప్రమోష‌న్స్ మాత్రం డ‌ల్‌గా సాగుతున్నాయి. అస‌లు ఈ సినిమా వ‌స్తోంద‌న్న స‌డే లేదు. నాని సినిమా మ‌రీ బ‌జ్ లేకుండా రిలీజ్‌కి సిద్దం అవ్వడం ఈమ‌ధ్య కాలంలో ఇదే తొలిసారేమో. నాని సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు క‌దా, ప‌బ్లిసిటీ లేక‌పోయినా న‌డిచిపోతుందిలే అనే ధీమా నిర్మాత‌ల‌కు ఉందేమో? ఓవైపు జాగ్వార్ లాంటి డ‌బ్బింగ్ సినిమాలు ప్రమోష‌న్ల‌తో హోరెత్తించేస్తోంటే, మ‌జ్ను చ‌ప్పుడు చేయ‌క‌పోవ‌డం ఆశ్చర్యప‌రుస్తోంది.

మజ్ను ప‌బ్లిసిటీ విష‌యంలో నాని కూడా నిరాశ‌గానే ఉన్నాడ‌ట‌. ఇదే విష‌య‌మై నిర్మాత‌లో గ‌ట్టిగా మాట్లాడాడ‌ట కూడా. ప్రమోష‌న్లు మీరు చేస్తారా, న‌న్ను చేసుకోమంటారా? అని నాని నిల‌దీయ‌డంతో… స‌డ‌న్‌గా తేరుకొన్న నిర్మాత‌లు బుధ‌వారం నుంచి ప్రమోష‌న్ల స్పీడు పెంచాల‌ని చూస్తున్నారు. సెన్సార్ టాక్ కాస్త డ‌ల్‌గా ఉండ‌డంతో చిత్రబృందం కాస్త నిరాశ‌కులోన‌య్యింద‌ని అందుకే ప్రమోష‌న్ల‌పై దృష్టి నిల‌ప‌డం లేద‌ని తెలుస్తోంది. మ‌జ్నుకి పోటీగా ఏ సినిమా లేక‌పోవ‌డంతో మ‌జ్ను బృందం ధీమాగా ఉంద‌ని, అందుకే ప‌బ్లిసిటీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, రిలీజ్ త‌ర‌వాత టాక్‌ని బ‌ట్టి ప‌బ్లిసిటీ విష‌యంలో వ్యూహం మార్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close