నో టాలీవుడ్ ఓన్లీ కోలీవుడ్..!

హాట్ భామ నయనతార టాలీవుడ్లో క్రేజీ ఆఫర్లు వస్తున్నా సరే వాటిని కాదంటుందట. కోలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న ఈ బ్యూటీ అక్కడ ఏ సినిమా చేసినా అది సూపర్ హిట్ అవుతుంది. తని ఒరువన్, మాయ, రీసెంట్ గా నాన్ రౌడీ థాన్.. ఇలా వరుసెంట నటించిన సినిమాలన్ని సూపర్ హిట్స్ అవుతుండటంతో అమ్మడు కోలీవుడ్లో హాట్ హీరోయిన్ అయ్యింది. అమ్మడి ఫామ్ని చూసి కోలీవుడ్ స్టార్ హీరోల సైతం అవాక్కవుతున్నారు.

ప్రస్తుతం తమిళ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న నయన్ కు తెలుగులో కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయట. గత సంవత్సర కాలంగా సినిమా చేయని విక్టరీ వెంకటేష్ ఎట్టకేలకు తన తర్వాత సినిమాను ఓకే చేశాడు. మారుతితో తీస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార కోసం డేట్స్ అడగనున్నారట. ప్రస్తుతం కోలీవుడ్లో టచ్ చేయలేని పొజిషన్లో ఉంది నయనతార. మరి అలాంటి అమ్మడు తెలుగు ఆఫర్లను ఓకే చేస్తుందా అంటే డౌటే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.

హ్యాట్రిక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న నయన్ ఒకవేళ తెలుగులో కూడా చేస్తే ఆ సక్సెస్ మేనియాని కొనసాగించినట్టే అవుతుంది. ఎందుకంటే అక్కడ మాయగా రిలీజ్ అయిన నయన్ సినిమా తెలుగులో కూడా మయూరిగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ క్రేజ్ మీదే నయన్ కోసం ఇక్కడ నిర్మాతలు కూడా క్యూలు కడుతున్నారు. మరి ఒకేసారి తెలుగు తమిళ్ సినిమాల్లో సక్సెస్ లు కొట్టిందంటే సౌత్ సూపర్ హీరోయిన్ గా నయనతార అందలం ఎక్కినట్టే.. మీరేమంటారు రీడర్స్..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

మేనిఫెస్టో మోసాలు : పట్టగృహనిర్మాణ హామీ పెద్ద థోకా !

జగన్మోహన్ రెడ్డి తాను చెప్పుకునే బైబిల్, ఖురాన్, భగవద్గీతలో అయిన మేనిఫెస్టోలో మరో ప్రధాన హామీ పట్టణ గృహనిర్మాణం. మూడు వందల అడుగుల ఇళ్లు ఇచ్చి అడుగుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close