నో రిఫండ్ బుకింగ్ – 9కి విశాఖ హోటల్స్ రెడీ !

వైసీపీ నేతలు చేస్తున్న అతి కారణంగా విశాఖలో 9వ తేదీన హోటల్స్ నిండిపోతున్నాయని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. కానీ ఆ రోజున విశాఖలో ఉన్న హోటళ్లలో ఇప్పటికే వందల కొద్ది రూములు ఖాళీగా ఉన్నాయి. విశాఖ టూరిస్టు డెస్టినేషన్ స్పాట్. సమ్మర్ లో ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇలాంటి చోట… హోటల్స్ కు మంచి ఆక్యూపెన్సీ ఉంటుంది. ప్రతీ రోజు ప్రతి హోటాల్ లో 70 నుంచి వంద శాతం ఆక్యుపెన్సీ ఉంటుంది. ఇప్పడు కూడా అదే ఉంది తప్ప.. కొత్తగా ఏమీ డిమాండ్ కనిపించడం లేదు.

హోటల్స్ బుక్ చేసుకోండి అని.. వైసీపీని గుడ్డిగా నమ్మేవారిని మోటివేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. విశాఖలో అత్యంత లగ్జరీ హోటల్ అయిన నోవాటెల్ లో హోటల్ రూములు కావాల్సినన్ని అందుబాటులో ఉన్నాయి. హైప్ కోసం బుక్ చేసుకుని చివరిలో క్యాన్సిల్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నో రిఫండ్ పద్దతిని హోటల్ ప్రవేశ పెట్టింది. రూమ్ రెంట్ ను అమాంతంగా పెంచేసింది. ఇదే పద్దతిని ఇతర హోటల్స్ అనుసరిస్తున్నాయి. 8, 9 తేదీల్లో చేసుకునే బుకింగ్స్ కు పూర్తి మొత్తం ముందే చెల్లించాలని.. క్యాన్సిల్ చేసుకుంటే ఒక్క రూపాయి కూడా తిరిగి ఇచ్చేది లేదని చెబుతున్నాయి.

గెలుపుపై నమ్మకం పెంచడానికి వైసీపీ నేతలు చేస్తున్న విన్యాసాల్లో హోటల్ బుకింగ్స్ కూడా ఒకటి. నిజంగా గెలిచే వాళ్లు నిశ్శబ్దంగా బాక్సుల్లో ఉన్న ఫలితాల కోసం ఎదురు చూస్తారు కానీ… నమ్మకం లేనోళ్లు చేసే హడావుడికి మాత్రం హద్దే ఉండదు. వచ్చే పది రోజుల్లో చాలా చక్కబెట్టుకోవాలన్నట్లుగా సీన్ మారుతోంది. అయినా పిచ్చిగా నమ్మేవారిని నట్టేట ముంచడానికి కూడా ఇలాంటి ప్రచారాలతో వెనుకాడటం లేదు వైసీపీ నేతలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజీనామా చేసిన వాలంటీర్ల పెడబొబ్బలు !

తమను మల్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని వాలంటీర్లు టీడీపీ నేతల వద్దకు పరుగులు పెడుతున్నారు. తమతో బలవంతంంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీసులుకు ఫిర్యాాదు చేసేందుకు వెనుకాడటం లేదు. వారి బాధ ఇప్పుడు...

క‌థాక‌మామిషు: ఈవారం క‌థ‌ల‌పై రివ్యూ

క‌థా స్ర‌వంతిలో మ‌రో వారం గ‌డిచిపోయింది. ఈవారం (జూన్ 16) మ‌రి కొన్ని క‌థ‌లు పాఠ‌కుల ముందుకు వ‌చ్చాయి. ర‌చ‌నా శైలి ఎలా ఉన్నా, వ‌స్తువులో వైవిధ్యం క‌నిపించ‌డం మంచి ప‌రిణామం. నాన్న...

ఆయనొస్తే.. ఇక బీఆర్ఎస్ ను ఆపే వారే ఉండరు..!

తెలంగాణ గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్ గా...

ఘోర రైలు ప్రమాదం… కవచ్ టెక్నాలజీ ఏమైంది..?

దేశంలో ఒక దాని వెనక మరొకటి వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ ఘటన మరవక ముందే మరో ఘటన జరుగుతుండటంతో రైలు ప్రయాణాలు అంటే ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close