ఇన్‌సైడ్ న్యూస్‌: ‘ఎన్టీఆర్‌’ పారితోషికాలపై పేచీ..?

‘ఎన్టీఆర్‌’ బ‌యోపిక్‌ని రెండు భాగాలుగా తీద్దామ‌న్న నిర్ణ‌యం.. బాల‌కృష్ణ‌లోని తెలివితేట‌ల‌కు నిద‌ర్శ‌నం. ఈ చిత్రానికి ఆయ‌నే నిర్మాత అన్న సంగ‌తి తెలిసిందే. ఒక బ‌యోపిక్‌, రెండు భాగాలు, రెండింత‌ల లాభం. ఇదీ ఆయ‌న ప్లాన్‌. అయితే… ఒకే సినిమాని రెండు భాగాలుగా తీసి, రెండు సార్లు అమ్ముకుంటున్న‌ప్పుడు .. రెండేసి పారితోషికాలు ఇవ్వాలిగా.?? ప్ర‌స్తుతం చిత్ర‌బృందంలో అదే చ‌ర్చ న‌డుస్తోంది. ఈ సినిమాకి ప‌ని చేసిన వాళ్లంతా ‘మాకు అద‌నంగా పారితోషికం కావాల్సిందే’ అని డిమాండ్ చేశార‌ని ఇన్‌సైడ్ వ‌ర్గాల నుంచి అందింన స‌మాచారం..

నిజానికి ఈ సినిమాని రెండు భాగాలుగా తీయాల‌న్న ఆలోచ‌న క్లాప్ కొట్టేట‌ప్పుడు లేదు. న‌టీన‌టుల్ని ఎంపిక చేసుకుని, వాళ్ల కాల్షీట్లు స‌ర్దుబాటు చేసుకున్నాకే… రెండు భాగాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. ఈ ఐడియా కూడా క్రిష్‌దేన‌ని తెలుస్తోంది. ‘రెండు భాగాలు’ వ‌ల్ల వ‌చ్చే అద‌న‌పు ప్ర‌యోజ‌నం అర్థ‌మైన బాల‌కృష్ణ క్రిష్ ఐడియాకు ఓకే చెప్పేశాడు. దాంతో ప‌నుల‌న్నీ ముమ్మ‌రంగా సాగిపోయాయి. అయితే.. అంత‌కు ముందే పారితోషికాలన్నీ సెటిల్ అయిపోయాయి. ఎవ‌రికి ఎంత ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? అనే విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. దానికి అంద‌రూ అంగీక‌రించి సంత‌కాలు పెట్టేశారు. అయితే ఎప్పుడైతే రెండు భాగాలు అని తెలిసిందో.. అప్పుడు ‘మ‌రి పారితోషికాల మాటేంటి?’ అనే ప్ర‌శ్న ఎదురైంద‌ని స‌మాచారం. ఈ సినిమాలో న‌టిస్తున్న కొంత‌మంది సీనియ‌ర్ న‌టీన‌టులు కొంత‌మంది ఈ విష‌యాన్ని క్రిష్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించిన‌ట్టు తెలుస్తోంది. దాన్ని బాల‌య్య ముందుకు తీసుకెళ్లాడ‌ట క్రిష్‌. రెండు పారితోషికాలు ఇవ్వ‌డం అనే ప్ర‌తిపాద‌న‌ని సానుకూలంగా తీసుకున్న బాల‌య్య‌… మ‌ధ్యేమార్గంగా పారితోషికాల్లో 50 శాతం పెంపుకు అంగీక‌రించాడ‌ని తెలుస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కు క్రిష్ ఓ సినిమాకు రూ.5 కోట్లు తీసుకున్నాడ‌నుకుందాం. రెండు భాగాల‌కు రూ.10 కోట్లు ఇవ్వాలి. కానీ రూ.7.5 కోట్ల‌కు సెటిల్ చేశార‌న్న‌మాట‌. అదీ.. ‘ఎన్టీఆర్‌’ పారితోషికాల లెక్క‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close