విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జయంతి. ఆయన గురించి తెలియని వాళ్లు ఉండరు. కానీ కొత్త తరానికి ఆయన గొప్పతనం అంత గొప్పగా తెలియడం లేదు. దీనికి కారణం రాజకీయం. ఆయనను కులం, మతం, ప్రాంతానికి పరిమితం చేసే రాజకీయం నడుస్తోంది. కానీ ఆయన గొప్పతనం..జెన్ జీ తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.
గ్లోబల్ ఐకాన్
ఎన్టీఆర్ టాలీవుడ్, పాలిటిక్స్ హిస్టరీలోనే ‘ది అల్టిమేట్ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ ’. నేటి తరం మార్వెల్ సూపర్ హీరోలను చూసి ఫిదా అయిపోతుంటుంది కానీ, అసలు ఏ లాంటి గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ లేని కాలంలోనే కేవలం తన కటౌట్, వాయిస్ బేస్, నటనతో ఒకే ఒక్కడుగా కోట్ల మందికి రియల్ సూపర్ హీరో గా మారిన గ్లోబల్ ఐకాన్ మన అన్నగారు.స్క్రీన్‌పై ఆయన కృష్ణుడిగానో, రాముడిగానో కనిపిస్తే థియేటర్లలో దండం పెట్టిన జనాలు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలు లేని ఆ రోజుల్లోనే బాక్సాఫీస్ బాస్ అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి రుచి చూపించిన హిస్టరీ ఆయనది.
ఫస్ట్ పాన్ ఇండియా హీరో
ఆయన జస్ట్ ఒక యాక్టర్ మాత్రమే కాదు.. సినిమా స్క్రిప్ట్‌ను, ఇండస్ట్రీ ట్రెండ్‌ను తన వైపునకు తిప్పుకున్న రూల్ బ్రేకర్. ‘దాన వీర శూర కర్ణ’ లాంటి ఒకే సినిమాలో కృష్ణుడు, కర్ణుడు, దుర్యోధనుడు లాంటి మూడు క్యారెక్టర్లను తానే వేసి, తానే డైరెక్ట్ చేసి, కేవలం కొన్ని రోజుల్లోనే ఆల్-టైమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టారంటే అది నెక్స్ట్ లెవెల్ మల్టీ టాస్కింగ్ . నేడు మన హీరోలు పాన్-ఇండియా రికార్డుల గురించి మాట్లాడుకుంటున్నారు కానీ, ఆ రోజుల్లోనే తెలుగు సినిమా అంటే ఏంటో నార్త్ బెల్ట్‌కు సైతం తెలిసేలా చేసిన రియల్ ట్రెండ్ సెట్టర్ ఎన్టీఆర్.
పొలిటికల్ మాస్ జాతర
ఇక పొలిటికల్ ఎంట్రీ అంటారా? అదైతే ఒక అన్‌స్టాపబుల్ రేంజ్ ‘మాస్ జాతర’! 60 ఏళ్ల వయసులో ‘తెలుగువారి ఆత్మగౌరవం’ అనే ఒకే ఒక్క నినాదంతో, కేవలం తొమ్మిది నెలల్లోనే సుదీర్ఘ కాలంగా దేశాన్ని ఏలుతున్న ప్రతిపక్ష పార్టీని వాషౌట్ చేసి, రికార్డ్ మెజారిటీతో సీఎం పీఠాన్ని దక్కించుకున్నారంటే అది ‘ఇంపాజిబుల్ పొలిటికల్ థ్రిల్లర్’. నేటి కాలంలో ఒక పొలిటికల్ స్టార్టప్ లేదా కొత్త పార్టీ అంత స్పీడ్‌గా పవర్ లోకి రావడం అనేది ఊహించలేం. చైతన్య రథంపై ఆయన చేసిన రోడ్ షోలు నేటి సోషల్ మీడియా ‘వైరల్ రీల్స్’ కంటే వేల రెట్లు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి.
జీవితాలను మార్చేసిన మహా జీవితం
కేవలం గెలవడమే కాదు.. ‘ప్రజలే దేవుళ్లు-సమాజమే దేవాలయం’ అంటూ ఆయన ప్రవేశపెట్టిన రూ. 2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్లు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు లాంటి విప్లవాత్మక నిర్ణయాలు నేటి వెల్ఫేర్ క్యాపిటలిజం కు రియల్ ఫౌండేషన్స్. నేటి ఏపీ ప్రభుత్వం సైతం ఆయన చారిత్రాత్మక వారసత్వాన్ని గుర్తిస్తూ మే 28ని అధికారిక ప్రభుత్వ వేడుకగా నిర్వహిస్తోంది. అందుకే ఇన్‌స్టా రీల్స్ లో, ట్విట్టర్ ట్రెండ్స్ లో బ్రాండ్ అనే పదానికి అసలైన అర్థం వెతికితే.. అది ఎప్పటికీ ఎన్టీఆర్ అనే మూడు అక్షరాల దగ్గరే ఆగుతుంది.
హ్యాపీ బర్త్‌డే టు ది ఎటర్నల్ లెజెండ్!
