ఢిల్లీలో `కార్ ఎమెర్జెన్సీ’… ట్వీట్స్, స్వీట్స్

దేశ రాజధాని ఢిల్లీలో కార్లు నడిపే ప్రజలకు అక్కడి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జనవరి 1 నుంచి `కార్ ఎమర్జెన్సీ’ విధించబోతున్నారు. కార్లు తిరగడంపై `ఈవెన్-ఆడ్’ పద్థతి తీసుకురాబోతున్నారు. నెంబర్ ప్లేట్ లో చివరి అంకె ఈవెన్ (2,4,6, 8…) ఉన్నవన్నీ రోజువిడిచి రోజుమాత్రమే వీధుల్లో తిరగాలి. అలాగే ఆడ్ నెంబర్ ఉన్న కార్లు (నెంబర్ ప్లేట్ చివర్లో 3,5,7,9…) కూడా రోజువిడిచి రోజుమాత్రమే రోడ్లెక్కాలి. ఏరోజు ఈవెన్ కార్లు తిరగాలో మరేరోజు ఆడ్ నెంబర్లున్న కార్లు తిరగాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అంటే కారున్నా ఇకపై రోజూ తిరగడం కుదరదు. నెలలో 15రోజులు మాత్రమే దాన్ని వీధుల్లో తిప్పగలం.

గత కొద్దిరోజుల్లో ఢిల్లీనగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంవల్ల సాధారణ స్థాయికంటే పదిరెట్లు ఎక్కువ కాలుష్యం నమోదైందని వాతావరణశాఖ తేల్చిచెప్పడంతో ఢిల్లీ ప్రభుత్వం `ఈవన్- ఆడ్’ పద్ధతిని ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అత్యవసర సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నూతన సంవత్సరం ఆరంభం నుంచి ఈ పద్ధతి అమల్లోకి వస్తుంది. `ఢిల్లీలో నివసించడమంటే.. గ్యాస్ ఛాంబర్ లో ఉన్నట్లే’ అని ఢిల్లీ హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేయడం కూడా `కార్ ఎమర్జెన్సీ’ పెట్టడానికి కారణమైంది. అయితే ప్రైవేట్ వెహికల్స్ కు వర్తించే ఈ ఎమర్జెన్సీ ప్రభుత్వ వాహనాలకు వర్తించదంటున్నారు. కేజ్రీవాల్ తీసుకున్న ఈ అత్యాయక నిర్ణయంపై సోషల్ మీడియాలో చిత్రవిచిత్రమైన కామెంట్స్ వస్తున్నాయి. వాటిలో కొన్ని….

ట్విట్స్…

– బిసి- 3108. ఇది కారు నెంబర్. చూడగానే ఏమనిపిస్తున్నదంటే, కేజ్రీవాల్ పాలన కూడా బిసీ లోకి వెళ్ళిపోయిందని.

– నెంబర్ ప్లేట్ చివర్లో సున్నా ఉంటే ఏం చేయాలి సార్..? పోలీసులకు వచ్చిన అనుమానం.

– జీరో అన్నది `ఆడ్’ కాదూ, `ఈవెన్’ కాదూ…కనుక రోజూ బయటకు తీయొచ్చు.

– అయ్యా కేజ్రీవాల్. కార్ల సంగతి ఇలా కానిచ్చారు, మరి వాటర్ సంగతేమిటీ? ఢిల్లీ వాసులను రోజువిడిచి రోజు స్నానాలు చేయమని ఆదేశిస్తారా ??

– ఢిల్లీ ఎమ్మెల్యేలకు 400% హైక్ వచ్చింది. కనుక, వాళ్లు ఇంకో కారు కొనుక్కోగలరు. ఒకటి ఆడ్ కీ, మరోకటి ఈవెన్ కీ. బాగానే ఉంది. మరి ఆమ్ ఆద్మీల (సామాన్యుల) పరిస్థితి ఏమిటీ ?

– ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి మరో చక్కని ఆలోచన ఉంది. ఆప్ వాళ్లు 365 రోజులూ ధర్నాలు చేస్తే సరి. అప్పుడు ఢిల్లీలో కార్లే తిరగలేవుగా…హ్హీహ్హీహ్హీ…

స్వీట్స్…

ట్వీట్స్ లో విమర్శలు వస్తున్నసంగతి అటుంచితే, కేజ్రీవాల్ బోల్డ్ గా తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నవారూ ఉన్నారు. పర్యావరణ శాస్త్రవేత్తలు తెగ సంతోషపడిపోతున్నారు. ప్రజల ఆరోగ్య ఎమర్జెన్సీ క్రింద ఇలాంటి చర్యలు తప్పవని అంటున్నారు. ప్రజలు రోజు విడిచి రోజు కార్లను బయటకు తీయడం వల్ల ఢిల్లీలో సగానికిసగం కాలుష్యం తగ్గిపోతుందని గట్టిగా నమ్ముతున్నారు. అయితే, కేజ్రీవాల్ ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి షకీల్ అహ్మద్ చురకలేశారు. బిజెపీ గోడమీద పిల్లివాటంగా మాట్లాడుతోంది. కాలుష్యం తగ్గించడానికి ఇలాంటి చర్యలు ఆహ్వానింపదగినవే కానీ, ప్రాక్టికల్ గా ఎంతవరకు సత్ఫలితాన్ని ఇస్తాయో చూద్దాం…అంటోంది.

ఈ పద్ధతి ఇప్పటికే బీజింగ్, సింగపూర్ లలో అమల్లోఉంది. అక్కడ ఈ ప్రయోగం విజయవంతమైందని ఆప్ నాయకులు చెబుతున్నారు. అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు మినహాయింపు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.కె. శర్మ అంటున్నారు. త్వరలోనే ఈ స్కీమ్ పూర్తి వివరాలను వెల్లడిస్తారట. ఈ పద్ధతిని ఎవరైనా ఉల్లంఘిస్తే, ఏమేరకు జరిమానా విధించాలన్నది కూడా ఇంకా ఖరారు కాలేదు. మొత్తానికి కేజ్రీవాల్ చేపట్టే ఈ పథకం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close