పెట్రో ధరలతో దేశ ప్రజల లూటీ..! నేడు భారత్ బంద్..!!

అప్పట్లో..! అంటే.. 2013లో..! గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఉన్న సమయంలో…! బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా మోడీ ఉన్న సమయంలో..!.. పెట్రో ధరల పెరుగుదలపై… బీజేపీ చేసిన ఆందోళన.. ఇప్పటికీ గుర్తుకు వస్తూనే ఉంది. సోషల్ మీడియా గుర్తుకు తెస్తూనే ఉంది. మోడీ ట్వీట్లు.. బీజేపీ వేషాలు.. అంతకు మించి.. పెట్రో ధరలతో దేశ ప్రజలను లూటీ చేస్తోందని.. తాము వస్తే.. మొత్తానికి కంట్రోల్ చేస్తామని ప్రకటనలు చేశారు. ఇది ప్రజలను ఆకర్షించింది. మోడీ విజయంలో అప్పటి పెట్రోల్ ధర పెరుగుదల కూడా ఓ కారణం. మరి అప్పుడు కాంగ్రెస్ లూటీ చేసిందంని చెప్పిన మోడీ ఇప్పుడేం చేస్తున్నారు…?. అప్పులు కాంగ్రెస్ లూటీ చేస్తే.. మోడీ నిలువు దోపిడీ చేస్తున్నట్లు లెక్క. ఓ రకంగా ప్రజలపై అప్పటి కాంగ్రెస్ పార్టీ మానవత్వం చూపించింది. ఇప్పుడు మోడీ అది కూడా చూపించడం లేదు.

యూపీఏ-2 హయాంలో… బ్యారెల్ క్రూడాయిల్ ధర 140 డాలర్ల వరకూ వెళ్లింది. 80 శాతం దిగుమతుల మీద ఆధారపడుతుంది మనదేశం.. అంత భారీగా క్రూడాయి ధర ఉన్నప్పుడు.. ఐదేళ్ల క్రితం.. పెట్రోల్ ధర… రూ. 60కి అటూఇటుగా ఉండేది. ఆ తర్వాత క్రూడాయిల్ ధర అత్యంత దారుణంగా పడిపోయి 25 డాలర్లకు కూడా వచ్చింది.. ఇప్పుడు 70 డాలర్ల దగ్గర ఉంది. అయినా పెట్రోల్ రేటు.. రూ. 86కి చేరింది. డీజిల్ రూ. 80కి చేరింది. మోడీ 2014లో అధికారం చేపట్టిన లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజు పన్ను రూ.9.48 వున్నదల్లా 2018కి రూ.21.48 కి పెంచారు. పెట్రో ట్యాక్సుల వల్ల 2014-15లో రూ. 1.05 లక్షల కోట్లు. అదే నాలుగేళ్ల తర్వాత 2018-19లో రూ.2.57 లక్షల కోట్లకు చేరింది. అంటే ప్రజలను ఏ రీతిన నిలువు దోపిడీ చేశారో అర్థం చేసుకోవచ్చు. ఇందులో మోసం ఏమిటంటే.. ఈ పెట్రో ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందన్న కారణంగా.. బడ్జెట్‌లో మరో మాయోపాయం ప్రదర్శించారు. ట్యాక్స్‌ను లీటర్‌కు రూ. 8 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కాని అదే రోజున మౌలిక వసతుల సెస్‌గా ఆ ఎనిమిది రూపాయలు వసూలు చేస్తామని ప్రకటించారు. ఈ సెస్‌ లో ప్రభుత్వాలకు వాటా రాదు.

ఈ దోపిడీపై ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. అందుకే ప్రతిపక్షాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌కు అనూహ్యమైన మద్దతు లభిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు కూడా స్వచ్చందంగా సంఘిభావం ప్రకటిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్ ధరలు జీఎస్టీలో కలుపుతారో… లేకపోతే.. పన్నులే తగ్గిస్తారో.. కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. పెట్రో భారాన్ని తగ్గించాలి. ఇది కేంద్రం చేతిలో లేని పనేం కాదు. కేంద్ర మాజీ అర్థిక మంత్రి చిదంబరం చెప్పినట్లు లీటర్‌ పెట్రోల్‌పై రూ.25 భారం తగ్గించడం సాధ్యమే. అందుకు రాజకీయ నిర్ణయం జరగాలి. మోడీ సర్కారు అలా చేయకపోతే ఆ పెట్రో మంటలకే బలికావాల్సిన పరిస్థితి రావొచ్చు. దానికి భారత్ బందే.. ప్రారంభం కావొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close